Home

»

Latest News

మైత్రీకి సామ్ ఫ్యాక్ట‌ర్ మ‌రోసారి ప్ల‌స్స‌య్యేనా!

Dec 09, 2021

తెలుగునాట క్రేజీ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తున్న నిర్మాణ సంస్థ‌ల్లో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఒక‌టి. ఒక‌వైపు అగ్ర క‌థానాయ‌కుల‌తో సినిమాలు నిర్మిస్తూనే.. మ‌రోవైపు యువ క‌థానాయ‌కుల‌తోనూ విభిన్న చిత్రాలు ప్రొడ్యూస్ చేస్తోంది ఈ పాపుల‌ర్ ప్రొడ‌క్ష‌న్ హౌస్.

ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో ఈ సంస్థ నుంచి రాబోతున్న చిత్రం `పుష్ప - ద రైజ్`. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. డిసెంబ‌ర్ 17న థియేట‌ర్స్ లో సందడి చేయ‌నుంది. పాన్ - ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బ‌న్నీకి జోడీగా ర‌ష్మికా మంద‌న్న న‌టించ‌గా.. ఓ ప్ర‌త్యేక గీతంలో స‌మంత త‌న చిందులతో క‌నువిందు చేయ‌నుంది.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. గ‌తంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన రెండు చిత్రాల్లో స‌మంత నాయిక‌గా న‌టించింది. `జ‌న‌తా గ్యారేజ్`, `రంగ‌స్థ‌లం`.. ఇలా మైత్రీ నిర్మించిన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో సామ్ హీరోయిన్ గా అల‌రించింది. ఈ రెండు సినిమాలు కూడా సెన్సేష‌న‌ల్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో.. `పుష్ప - ద రైజ్`లోనూ సామ్ ఫ్యాక్ట‌ర్ క‌లిసొచ్చి మైత్రీ మూవీ మేక‌ర్స్ ఖాతాలో మ‌రో సంచ‌ల‌న విజ‌యం న‌మోద‌వుతుందేమో చూడాలి. అలాగే, సామ్ - మైత్రీ కాంబోలో హ్యాట్రిక్ చేరుతుందా?  లేదా? అన్న‌ది కూడా ఆస‌క్తిక‌ర‌మే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com