మూవీ హిస్టరీలోని బెస్ట్ పర్ఫార్మెన్స్‌లో ఒకటి.. 'పుష్ప' పర్ఫార్మెన్స్!
on Dec 21, 2021

సుకుమార్ తీర్చిదిద్దిన 'పుష్ప'గా అల్లు అర్జున్ ప్రదర్శించిన అభినయం ప్రేక్షకులు, విమర్శకులతో పాటు ఫిల్మ్ ఫ్రాటర్నిటీని కూడా మంత్రముగ్ధుల్ని చేస్తోంది. బన్నీ నటనకు ఫిదా అయిన మూవీ సెలబ్రిటీల జాబితాలో తాజాగా అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా చేరాడు. సోమవారం 'పుష్ప' మూవీని చూసిన ఆయన బన్నీ నటనను సినిమా చరిత్రలోని గొప్ప అభినయాల్లో ఒకటిగా కీర్తించాడు.
Also read: "నీయవ్వ.. ఇదికదా యాక్టింగ్ అంటే".. 'పుష్ప' విలన్ అజయ్ ఘోష్‌కు సుకుమార్ కాంప్లిమెంట్!
తన ట్విట్టర్ హ్యాండిల్‌లో సందీప్‌రెడ్డి, "అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ హైపర్‌సానిక్ మిస్సైల్ కంటే తక్కువదేమీ కాదు, ప్రేక్షకులు దయచేసి 'పుష్ప'ను చూసి, అల్లు అర్జున్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వండి. సినిమాని చూశాక మరిన్ని ఒవేషన్స్‌కు ఆయన అర్హుడు. మూవీ హిస్టరీలోని బెస్ట్ పర్ఫార్మెన్స్‌లో ఇదొకటి." అని రాసుకొచ్చాడు. మరో ట్వీట్‌లో "కేవలం ఫిల్మ్‌మేకర్స్ మాత్రమే ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాలి, దీనికి నేను 100/100 రేటింగ్ ఇస్తాను" అని రాశాడు.
Also read: నిన్న 'రంగస్థలం'.. నేడు 'పుష్ప'.. సుకుమార్ సూపర్బ్ ఫీట్!
దీనికి అల్లు అర్జున్ స్పందించాడు. మీ హృదయపూర్వక అభినందనలకు ధన్యవాదాలు. నా నటన మిమ్మల్ని స్పృశించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చూసిన గౌరవం, ప్రేమకు ధన్యవాదాలు అని రిప్లై ఇచ్చాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



