నిన్న 'రంగస్థలం'.. నేడు 'పుష్ప'.. సుకుమార్ సూపర్బ్ ఫీట్!
on Dec 20, 2021
.webp)
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప: ది రైజ్' బాక్సాఫీస్ దగ్గర అన్‌బిలీవబుల్ ఫిగర్స్‌ను నమోదు చేస్తూ దూసుకుపోతోంది. విడుదలైన రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ థియేటర్ల దగ్గర జాతరను తలపించేలా జనం హోరు కనిపిస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు రూ. 52.98 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
Also read: మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డ్ సృష్టించిన 'పుష్ప'!
కాగా ఈ సినిమాతో డైరెక్టర్ సుకుమార్ వైజాగ్ సిటీలో తన సత్తా మరోసారి చాటాడు. ఆయన మునుపటి సినిమా 'రంగస్థలం' వైజాగ్ సిటీలో విడుదలైన తొలి మూడు రోజులకు 147 షోలకు గాను అన్ని షోలూ హౌస్‌ఫుల్ అయ్యి బిగ్ ఫిలిమ్స్‌లో ఒక రికార్డు సృష్టించగా, ఇప్పుడు 'పుష్ప' మూవీ మూడు రోజులకు 132 షోలకు గాను అన్ని షోలూ ఫుల్ అయ్యాయి. ఇటీవలి కాలంలో ఈ ఫీట్ సాధించిన డైరెక్టర్‌గా సుకుమార్ రికార్డు సాధించాడు. 'రంగస్థలం' తర్వాత మరే బిగ్ స్టార్ సినిమా కూడా తొలి మూడు రోజుల్లో ఆల్ షోస్ ఫుల్ కాలేదు. ఇప్పుడు మళ్లీ సుకుమార్ సినిమా 'పుష్ప' ఆల్ షోస్ ఫుల్ అయ్యింది.
Also read: కలెక్షన్లలో నంబర్ వన్ ఇండియన్ మూవీగా 'పుష్ప'.. తగ్గేదే లే!
మిక్స్‌డ్ టాక్‌లోనూ తెలుగునాట అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో 'పుష్ప' చూపించింది. పుష్పరాజుగా బన్నీ చెలరేగి చేసిన నటన సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. క్లైమాక్స్ వీక్‌గా ఉందనే టాక్ ఒక్కటే సినిమాకు మైనస్ అని చెప్పాలి. రష్మిక మందన్నతో బన్నీ రొమాన్స్ ఆకట్టుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



