'భీమ్లా నాయక్' కోసం ఫిబ్రవరిని త్యాగం చేసి ఏప్రిల్‌కు మారిన 'ఎఫ్3'
on Dec 21, 2021

వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటిస్తోన్న 'ఎఫ్3' మూవీ విడుదల తేదీ మారింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీ ఏప్రిల్ 29న సమ్మర్‌కి విడుదల కానున్నది. ఈ విషయాన్ని మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు ప్రకటించారు. నిజానికి 'ఎఫ్3'ని ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు ఇదివరకు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ తేదీన పవన్ కల్యాణ్ సినిమా 'భీమ్లా నాయక్' రిలీజవబోతోంది. అంటే ఆ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందున్న మాట. 'భీమ్లా నాయక్' కోసం తమ సినిమా విడుదల తేదీని దిల్ రాజు త్యాగం చేశారు. సందర్భవశాత్తూ 'భీమ్లా నాయక్'ను తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది ఆయనే.
Also read: మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డ్ సృష్టించిన 'పుష్ప'!
వెంకటేశ్ జోడీగా తమన్నా, వరుణ్‌తేజ్ సరసన మెహ్రీన్ పిర్జాడా నటిస్తోన్న 'ఎఫ్3'లో రాజేంద్రప్రసాద్, సునీల్, మురళీశర్మ, అలీ, సత్య, వెన్నెల కిశోర్, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, సంగీత, తులసి, అన్నపూర్ణ, వై. విజయ, ప్రగతి, సోనాల్ చౌహాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, సాయిశ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా పనిచేస్తున్నారు.
Also read: 'పుష్ప' చేయను నన్ను వదిలేయండన్నా.. 'సుకుమార్' నా ముందు డ్యాన్స్ చేశారు!
2019 సంక్రాంతికి వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్టయిన 'ఎఫ్2'కి సీక్వెల్‌గా 'ఎఫ్3' వస్తోంది. ఒరిజినల్ మూవీ తరహాలోనే సీక్వెల్‌ను కూడా సంక్రాంతికి తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు మొదట భావించారు. కానీ 'ఆర్ఆర్‌ఆర్', 'రాధే శ్యామ్' సినిమాలు సంక్రాంతికి ఫిక్సవడంతో ఫిబ్రవరికి విడుదల తేదీని మార్చారు. ఇప్పుడు మారిన సమీకరణాలతో మరోసారి రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



