మైండ్ బ్లోయింగ్.. సూపర్ స్టార్ కి గూస్ బంప్స్ తెప్పించిన 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్!
on Dec 10, 2021
ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ గురువారం విడుదలైంది. బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ అంచనాలకు మించి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతూ స్క్రీన్ పై సింహాల్లా గర్జించారు. ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం ఈ ట్రైలర్ కి ఫిదా అవుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించిందంటూ ఆకాశానికి ఎత్తేశాడు.
Also Read: మహేష్, చరణ్ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ పై మహేష్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "ట్రైలర్ లో ప్రతి షాట్ స్టన్నింగ్ గా, మైండ్ బ్లోయింగ్ గా ఉంది. మాస్టర్ స్టోరీ టెల్లర్(రాజమౌళి) మళ్లీ వచ్చేశాడు. చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ ఫీల్ అయ్యా" అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. తారక్, చరణ్ తో మహేష్ కి మంచి బాండింగ్ ఉంది. అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి-మహేష్ పట్టాలెక్కే అవకాశముంది. ఇప్పుడు ట్రైలర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ మహేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. 'పులి'ని పట్టుకోవాలంటే 'వేటగాడు' కావాలి!
Also read: ఊపిరి బిగపట్టించే, ఒళ్లు జలదరింపజేసే సీన్లతో 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్
'ఆర్ఆర్ఆర్'లో కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నారు. అజయ్ దేవ్ గణ్, అలియా భట్, శ్రియ, ఒలీవియా మోరిస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2022, జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
