సామ్ `యశోద`లో `క్రాక్` లేడీ విలన్!
on Dec 10, 2021
ఈ ఏడాది సంక్రాంతి సెన్సేషన్ `క్రాక్`లో లేడీ విలన్ జయమ్మగా ఆకట్టుకున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. తనదైన అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసారు. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. నటసింహం నందమూరి బాలకృష్ణతో స్టార్ కెప్టెన్ గోపీచంద్ మలినేని రూపొందించనున్న సినిమాలోనూ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా వరలక్ష్మీ ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే.. చెన్నై పొన్ను సమంత టైటిల్ రోల్ లో `యశోద` పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని దర్శకద్వయం హరి - హరీశ్ తీర్చిదిద్దుతున్నారు. కాగా, ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుందని సమాచారం. పాత్ర ఎంతో విభిన్నంగా ఉండడంతో వరలక్ష్మి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బజ్. త్వరలోనే `యశోద`లో వరలక్ష్మి ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
కాగా, మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్న `యశోద` వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి వచ్చే అవకాశముంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
