బాలయ్యతో మరోసారి ప్రగ్యా రొమాన్స్!
on Dec 10, 2021
`డేగ` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఉత్తరాది భామ ప్రగ్యా జైశ్వాల్.. ఆపై `మిర్చి లాంటి కుర్రాడు`, `కంచె`, `ఓం నమో వెంకటేశాయ`, `గుంటూరోడు`, `నక్షత్రం`, `జయ జానకి నాయక`, `ఆచారి అమెరికా యాత్ర` వంటి సినిమాల్లో సందడి చేసింది. అయితే నటసింహం నందమూరి బాలకృష్ణకి జోడీగా నటించగా తాజాగా తెరపైకి వచ్చిన `అఖండ`తోనే కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ చూసింది ప్రగ్యా జైశ్వాల్. ``జై బాలయ్య`` పాటలో బాలయ్య సరసన తన చిందులతో కనువిందు చేసింది.
ఇదిలా ఉంటే.. `అఖండ` సంచలన విజయంతో టాలీవుడ్ దృష్టిని `కంచె` తరువాత మరోసారి ఆకర్షించిన ప్రగ్యా జైశ్వాల్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కి సంతకం చేసే పనిలో ఉందని బజ్. వాటిలో తన లక్కీ స్టార్ బాలయ్య సినిమా కూడా ఉందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బాలకృష్ణ ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ లో ప్రగ్యా ఓ నాయికగా ఎంపికైందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది.
మరి.. `అఖండ` అనంతరం మరోసారి బాలయ్యతో రొమాన్స్ చేయనున్న ప్రగ్యా జైశ్వాల్.. ఈ సారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
