#SSMB28 లాంఛనంగా మొదలైంది
on Feb 3, 2022

సూపర్‌స్టార్ మహేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న మూడో సినిమా పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్‌లో జరిగాయి. మహేశ్ హీరోగా నటిస్తోన్న ఈ 28వ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై తొలి షాట్‌ను చిత్రీకరించారు. సెంటిమెంట్ ప్రకారం మహేశ్ ఈ ఈవెంట్‌కు హాజరు కాలేదు. చాలా కాలంగా ఆయన తన సినిమాల ప్రారంభ కార్యక్రమానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన భార్య నమ్రత ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ మూవీని #SSMB28గా పరిగణిస్తున్నారు. Also read: పుష్ప సాంగ్‌తో రెచ్చిపోయిన ఎయిర్ హోస్టెస్

మహేశ్, త్రివిక్రమ్ కలయికలో ఇదివరకు 'అతడు' (2005), 'ఖలేజా' (2010) చిత్రాలు వచ్చాయి. వీటిలో 'అతడు' మంచి విజయం సాధించడంతో పాటు మ్యూజికల్‌గా కూడా బాగా పేరు తెచ్చుకుంది. 'ఖలేజా' ఆశించిన రీతిలో ఆడకపోయినా, మహేశ్ నటన, త్రివిక్రమ్ డైలాగ్స్‌కు ప్రశంసలు లభించాయి. 12 సంవత్సరాల సుదీర్ఘ విరామంతో ఆ ఇద్దరూ తమ మూడో చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే నాయికగా ఎంపికైంది. మహేశ్‌తో 'మహర్షి' తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇది. అలాగే త్రివిక్రమ్‌తో వరుసగా మూడో సినిమా. మునుపటి త్రివిక్రమ్ సినిమాలు 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో' ఆమె హీరోయిన్‌గా చేసింది. Also read: మళ్లీ రెచ్చిపోతున్న అనసూయ!

త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాసిన 'భీమ్లా నాయక్' విడుదలకు సిద్ధమవుతుండగా, మహేశ్ హీరోగా నటిస్తోన్న 27వ సినిమా 'సర్కారువారి పాట' మేలో విడుదల కానున్నది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



