పుష్ప సాంగ్‌తో రెచ్చిపోయిన ఎయిర్ హోస్టెస్
on Feb 2, 2022

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప… పార్ట్ వన్. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై.. సూపర్ డూపర్ హిట్ సాధించింది. కలెక్షన్ల పరంగా బాక్సాపీస్‌ను సైతం కుమ్మి పడేస్తోందీ. అయితే ఈ చిత్రంలోని అల్లు అర్జున్ .. యాక్షన్‌కే కాదు.. అతడి డైలాగ్స్‌కు, మేనరిజమ్స్‌కు దేశవ్యాప్తంగా ప్రజలు ఫిదా అయిపోతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ మేనరిజమ్స్.. సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పుష్ప రాజ్.. ఓ రేంజ్‌లో ట్రెండ్ సెట్టర్ అయిపోయాడు.
ఇక ఈ చిత్రంలోని పాటలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఈ చిత్రంలో ఊ అంటావా మావా... అంటూ సమంత ఐటెం సాంగ్ అయితే రచ్చరచ్చ చేసి పడేస్తోంది. ఇక శ్రీవల్లి సాంగ్ అయితే చెప్పేపనే లేదు. ఈ పాటకు భారీగా స్పందన వస్తోందీ. అయితే ఇండియన్ క్రికేటర్సే కాదు.. విదేశీ క్రికెటర్లు సైతం పుష్ప మేనరిజమ్స్ తో ఇన్ స్టా రీల్స్ చేస్తున్నారు. ఆ క్రమంలో పుష్ప సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేస్తోంది.
అయితే సెలబ్రిటీలే కాకుండ సామాన్యలు సైతం అల్లు అర్జున్ స్టెప్స్‌ను రీ క్రియేట్ చేస్తుండడం గమనార్హం. తాజాగా ఓ ఎయిర్ హోస్టెస్ పుష్ప మూవీలో శ్రీవల్లి సాంగ్‌కు చిందులేసే ప్రయత్నం చేసి.. సిగ్గు పడింది. అందుకు సంబంధించిన వీడియోను సదరు ఎయిర్ హోస్టెస్ ఇన్ స్టా గ్రామ్ వేదిగా షేర్ చేసింది. ఈ వీడియో .. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఎయిర్ హోస్టెస్ బాగానే ట్రై చేసిందంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



