
అక్కినేని హీరో నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా భార్య శోభిత ధూళిపాళ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఇద్దరూ లిప్‌కిస్ చేసుకుంటున్న ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నవంబర్ 23న నాగచైతన్య తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోలతో కూడిన ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఓ ఫొటోలో ఈ జంట ఓ పసుపు రంగు ఆర్చ్ కింద ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. మరో ఫొటోలో ఇద్దరూ కలిసి పోజులిచ్చారు. చైతన్యకు సంబంధించిన ఓ సరదా వీడియోను కూడా ఈ ఫొటోలతో పాటు షేర్ చేశారు.
ఈ పోస్ట్‌కు శోభిత పెట్టిన క్యాప్షన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘‘Happy birthday lover’’ అంటూ కేవలం మూడు పదాల్లోనే తన ప్రేమను వ్యక్తం చేశారు. ఎలాంటి పెద్ద సందేశం లేకుండా ఓ రొమాంటిక్ ఫొటో, చిన్న క్యాప్షన్‌తో భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో అభిమానులు ఈ పోస్ట్‌ను తెగ షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా లిప్‌కిస్ ఫొటోపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.

నాగచైతన్య, శోభిత ప్రేమ 2024 డిసెంబర్ లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలను పంచుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: వృషకర్మ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
ఇదిలా ఉంటే.. నాగచైతన్యకు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విక్టరీ వెంకటేశ్ కూడా చైతన్యతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు.

సినిమాల విషయానికొస్తే, చైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ అడ్వెంచర్ మిస్టికల్ థ్రిల్లర్ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చవచ్చు:
చిరంజీవి పేరులో ‘N’ మాయం.. ఆ హోర్డింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా.?
మూడు రోజుల్లోనే 100 కోట్లు.. ధనుష్ ‘OM’ బాక్సాఫీస్ దూకుడు.!
[Naga Chaitanya, Birthday, Sobhita Dhulipala, Lip kiss, Vrushakarma]





