
ధనుష్, మమ్ముట్టి కలిసి నటించిన ‘OM - ఆపరేషన్ మోల్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో సత్తా చాటుతోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.101.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ సినిమాను ‘మెగా బ్లాక్‌బస్టర్’గా పేర్కొంది.
మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటడం సినిమాకు మంచి ఓపెనింగ్ దక్కినట్లు సూచిస్తోంది. ముఖ్యంగా ధనుష్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తోంది. గతంలో ఆయన నటించిన చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్ భారీ స్థాయిలో ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
‘OM - ఆపరేషన్ మోల్’ సినిమాకు ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ధనుష్, మమ్ముట్టి వంటి ఇద్దరు ప్రముఖ నటులు ఒకే సినిమాలో కనిపించడం ప్రేక్షకుల్లో ముందునుంచే ఆసక్తిని పెంచింది.

ఇందులో ధనుష్, మమ్ముట్టితో పాటు సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ జాగ్మాగ్ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఇది కూడా చదవండి: భోగి ట్రైలర్‌లో శర్వా విశ్వరూపం.. ఐదుగురు చెల్లెళ్ల కోసం గంగ పోరాటం.!
కథ విషయానికి వస్తే.. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఓ పోలీస్ అధికారి అండర్‌కవర్ ఆపరేషన్ చేపట్టడం చుట్టూ కథ సాగుతుంది. సాయి పల్లవి ఐపీఎస్ అధికారి నిత్యా రెడ్డి పాత్రలో, ధనుష్ పళని అనే అండర్‌కవర్ ఏజెంట్‌గా కనిపిస్తారు. మమ్ముట్టి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌కు చెందిన బర్మా కార్తికేయన్ పాత్రలో నటించారు.

మూడు రోజుల్లోనే రూ.101.7 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ వెల్లడించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలి మూడు రోజుల జోరును కొనసాగిస్తూ ‘OM’ మరిన్ని బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
మీకు నచ్చవచ్చు:
నిత్యా మేనన్ సంచలన నిర్ణయం.. అసలు కారణమిదే.!
వృషకర్మ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
[OM Box Office, OM 100 Crore, Dhanush, Mammootty, Rajkumar Periasamy]




