Home

»

Latest News

చిరంజీవి పేరులో ‘N’ మాయం.. ఆ హోర్డింగ్స్‌ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా.?

Nov 23, 2026 1:36PM

మెగాస్టార్ చిరంజీవి పేరు చెబితే అభిమానులకు పూనకాలు రావడం సహజం. అలాంటిది ఆయన పేరులోనే ఓ అక్షరం కనిపించకుండా పోతే? ఇప్పుడు హైదరాబాద్‌లో కనిపిస్తున్న భారీ హోర్డింగ్స్‌ ఇదే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా ‘CHIRANJEEVI’ అని ఉండాల్సిన పేరును ‘CHIRA_JEEVI’ అంటూ మధ్యలో ‘N’ లేకుండా ముద్రించారు. దీంతో అసలు దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొందరు ఇది కొత్త మూవీ ప్రమోషన్ అనుకుంటున్నారు.

అయితే ఈ హోర్డింగ్స్‌ వెనుక అసలు కారణం నెట్‌ఫ్లిక్స్‌ ప్రమోషన్‌ స్ట్రాటజీ అయి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే చిరంజీవి పేరులో మిస్ అయిన అక్షరం ‘N’. నెట్‌ఫ్లిక్స్‌ లోగో కూడా ‘N’ అక్షరమే కావడంతో, ఆ ఖాళీ స్థానంలో నెట్‌ఫ్లిక్స్‌ లోగోను ఉంచి కొత్త తరహాలో ప్రమోట్ చేయబోతున్నారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంతకీ ఈ హోర్డింగ్స్‌ దేనికోసమంటే.. చిరంజీవి తొలిసారి ఓటీటీ కోసం చేస్తున్న సెలబ్రిటీ టాక్‌ షో ‘మెగావర్స్‌’ కోసమేనని సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మెగాస్టార్‌ తన సినీ ప్రయాణంలో కలిసి పనిచేసిన నటీనటులు, దర్శకులు, ఇతర సినీ ప్రముఖులతో సరదాగా ముచ్చటించనున్నట్లు తెలుస్తోంది. వారి కెరీర్‌లోని ఆసక్తికరమైన సంఘటనలు, షూటింగ్‌ అనుభవాలు, తెరవెనుక జ్ఞాపకాలు ఈ షోలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

గతంలో చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చేయబోతున్న ‘మెగావర్స్‌’ గేమ్‌ షో కాదు. పూర్తిగా సినీ ప్రముఖులతో జరిగే సంభాషణల కార్యక్రమం. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ల షూటింగ్‌ కూడా పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: మెగాస్టార్ చేతుల మీదుగా ఆలోచన ట్రైలర్‌.. వారికి ఉచిత టికెట్లు.!

నవంబర్‌ 30న హైదరాబాద్‌లో ‘మెగావర్స్‌’ గ్రాండ్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో షోకు సంబంధించిన ప్రోమో, ఫార్మాట్‌, స్ట్రీమింగ్‌ తేదీ వంటి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. నాగార్జున, కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌, రవితేజ, నాని వంటి ప్రముఖులు ఈ షోలో పాల్గొంటారనే ప్రచారం కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఏదేమైనా చిరంజీవి పేరులో ఒక్క అక్షరాన్ని మాయం చేయడం ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ మంచి క్యూరియాసిటీని క్రియేట్‌ చేసినట్లే కనిపిస్తోంది. మరి ఆ మిస్సింగ్‌ ‘N’ స్థానంలో నెట్‌ఫ్లిక్స్‌ లోగోనే కనిపించబోతోందా? ‘మెగావర్స్‌’లో మెగాస్టార్‌ ఎవరెవరితో ముచ్చటించబోతున్నారు? ఈ ప్రశ్నలకు నవంబర్‌ 30న సమాధానం దొరికే అవకాశం ఉంది.

మీకు నచ్చవచ్చు: 
భోగి ట్రైలర్‌లో శర్వా విశ్వరూపం.. ఐదుగురు చెల్లెళ్ల కోసం గంగ పోరాటం.!
నిత్యా మేనన్‌ సంచలన నిర్ణయం.. అసలు కారణమిదే.!

 

 

 

[Chiranjeevi, N Missing, Netflix, Megaverse, Hyderabad]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com