సమంతా.. నువ్వు నా హృదయాన్ని గెలిచావ్! బన్నీ మాటకు సామ్ రెస్పాన్స్ ఇదే!!
on Dec 29, 2021

'పుష్ప' మూవీలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ "ఊ అంటావా మావా ఉఊ అంటావా మావా" పాట యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టించింది. వరల్డ్‌లోనే ఈ పాట పాపులర్ అయ్యింది. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ ఇచ్చిన ఈ పాటను చంద్రబోస్ రాయగా, ఇంద్రావతి చౌహాన్ పాడారు. అల్లు అర్జున్‌తో కలిసి సమంత చేసిన డాన్స్, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను అమితంగా అలరించాయి. కాగా ఈ పాట చేసినందుకు సమంతకు థాంక్స్ చెప్పాడు అల్లు అర్జున్. తనను నమ్మి ఆ పాట చేసి తన హృదయాన్ని గెలుచుకున్నావని కితాబిచ్చాడు. ఆ తర్వాత అతడిని సోషల్ మీడియా ద్వారా సమంత రిప్లై ఇవ్వడం గమనార్హం.
Also read: అరుదైన ఘటన.. బన్నీ, సుక్కు.. ఇద్దరూ ఒకేసారి ఏడ్చేశారు!
మంగళవారం జరిగిన థాంక్యూ మీట్‌లో మాట్లాడిన బన్నీ, ప్రత్యేకంగా సమంతకు థాంక్స్ చెప్పాడు. "సమంతగారూ థాంక్యూ సోమచ్, ఒక సాంగ్ చేసినందుకు. ఈ సాంగ్ మీరెంత నమ్మారో కానీ, మామీద నమ్మకంతో చేశారు చూశారా.. ఆ నమ్మకానికి థాంక్యూ. సెట్‌లో ఇది కరెక్టా, కాదా అని మీకెన్ని డౌట్స్ ఉండేవో నాకు తెలుసు. నేను మీకు ఒకటే చెప్పాను, 'నన్ను నమ్మి చేయండి' అని. అది విన్న తర్వాత మీరు ఒక్క ప్రశ్న కూడా వెయ్యకుండా చేశారు. మమ్మల్ని నమ్మినందుకు థాంక్యూ. ఏదడిగినా ఆలోచించకుండా చేసినందుకు మీరు నా హృదయాన్ని గెలిచారు, నా గౌరవాన్ని గెలిచారు. యూట్యూబ్‌లో 'ఊ అంటావా మావా ఉఊ అంటావా మావా' సాంగ్ నంబర్ వరల్డ్‌లోనే వన్ ప్లేస్‌లో నిలిచినందుకు మీకు అభినందనలు. మామూలు విషయం కాదిది. ఊ అంటావా ఉఊ అంటావా అనడానికి ఆప్షన్ లేకుండా ఎవరైనా సరే 'ఊ' అనాల్సిందే అనే రేంజ్‌లో సాంగ్ ఉంది. థాంక్యూ సామ్" అని మనస్ఫూర్తిగా చెప్పాడు బన్నీ.
Also read: బికినీలో సూపర్ హాట్ సామ్.. ఫ్రెండ్స్‌తో గోవాలో చిల్!
అతడి స్పీచ్‌ను ఒకరు ట్విట్టర్ లో షేర్ చేయగా, దాన్ని రిట్వీట్ చేసిన సమంత, "ఇక ఎప్పడూ నిన్ను నమ్ముతాను అల్లు అర్జున్" అని ఎమోషనల్‌గా కామెంట్ పెట్టింది. సమంత కామెంట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



