బికినీలో సూపర్ హాట్ సామ్.. ఫ్రెండ్స్‌తో గోవాలో చిల్!
on Dec 28, 2021
(1).webp)
అందాల తార సమంత గోవాలో హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. మాజీ మిసెస్ ఇండియా శిల్పారెడ్డి, మరో ఫ్రెండ్ వాసుకి స్పంజ్‌లతో కలిసి గోవాలోని బ్యూటిఫుల్ ప్లేసెస్, బీచ్‌లలో విహారం చేస్తోంది. బికినీలో ఉన్న ఒక సూపర్ హాట్ పిక్చర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలో చాలా ఆనందంగా కనిపిస్తోంది ఈ స్టన్నింగ్ బ్యూటీ. ఆ ఫొటోకు '#goayoubeauty." అనే క్యాప్షన్ జోడించింది.
తన బెస్ట్ ఫ్రెండ్స్‌తో నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంది సమంత. శిల్పారెడ్డిని తన సోల్ సిస్టర్ అంటూ ఇదివరకే సమంత చెప్పింది. పెళ్లయ్యాక ప్రతి సంవత్సరం నాగచైతన్యతో న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి అబ్రాడ్ వెళ్తూ వచ్చింది సామ్. అయితే ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. చైతూ నుంచి విడిపోయాక సింగిల్‌గా ఉంటోన్న సామ్ తొలిసారి న్యూ ఇయర్ పార్టీని ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకోబోతోంది.
శిల్పారెడ్డి షేర్ చేసిన ఫొటోలో బికినీలో సామ్ సూపర్ హాట్‌గా కనిపిస్తోంది. శిల్పా సైతం టూ-పీస్ బికినీలో మతులు పోగోడుతోంది. ఇక వాసుకి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన ఫొటోలో సామ్, శిల్ప, వాసుకి.. ముగ్గురూ బీచ్‌లో నడుం లోతు నీళ్లలో నిల్చొని ఇచ్చిన పోజు ఆకట్టుకుంటోంది.
(1).webp)
వర్క్ విషయానికి వస్తే, ఇటీవలే తన లేటెస్ట్ ఫిల్మ్ 'యశోద' ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసింది సమంత. హరి, హరీష్ సంయుక్తంగా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రధారులు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా నిర్మాణమవుతున్న 'యశోద'ను కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.
అలాగే నయనతార, విజయ్ సేతుపతితో కలిసి తమిళంలో 'కాదువాకుల రెండు కాదల్' సినిమా చేస్తోంది సామ్. తొలిసారి 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' అనే ఇంగ్లీష్ మూవీకి సంతకం చేసింది. ఇప్పటికే గుణశేఖర్ డైరెక్షన్‌లో 'శాకుంతలం' సినిమాని పూర్తి చేసింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



