నువ్వెప్పుడూ బ్యూటిఫుల్‌గా ఉంటావు! కాజల్‌పై సమంత కామెంట్!!
on Feb 9, 2022

ప్రెగ్నెన్సీ సమయంలో బాడీ షేమ్‌కి గురవుతున్న కాజల్ అగర్వాల్‌కి సమంత మద్దతుగా నిలిచింది. బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్న మూర్ఖుల కోసం కాజల్ ఇటీవల ఒక లాంగ్ నోట్‌ను రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై సమంత స్పందిస్తూ, కామెంట్స్ విభాగంలో ఆమెను ఉత్సాహపరిచింది. "నువ్వెప్పుడూ అందంగా ఉంటావు," అని రాసిన సమంత, దానికి ఒక హార్ట్ ఎమోజీని జోడించింది.
కాజల్ అగర్వాల్ తన లాంగ్ నోట్‌లో బాడీ షేమ్ చేసినందుకు ట్రోలర్లను విమర్శించింది. "గర్భధారణ సమయంలో, మన శరీరాలు బరువు పెరగడంతో పాటు అనేక మార్పులకు గురవుతాయి! హార్మోన్ల మార్పుల వల్ల శిశువు పెరిగేకొద్దీ మన కడుపు, రొమ్ములు పెద్దవిగా మారతాయి. మన శరీరం నర్సింగ్‌కి సిద్ధమవుతుంది. మన శరీరం పెద్దదిగా మారే చోట కొన్నిసార్లు స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడవచ్చు." అని ఆమె రాసింది. అనిర్వచనీయ భావాలతో ఎలా వ్యవహరిస్తుందనే దాని గురించి కొన్ని పాయింట్లను కూడా ఆమె పంచుకుంది. రాశీ ఖన్నా, ఈషా రెబ్బా కూడా కాజల్‌కు మద్దతు ఇచ్చారు. Also read: హరీశ్ శంకర్ దర్శకప్రస్థానానికి 16 ఏళ్ళు!
జనవరి 1న కాజల్, ఆమె భర్త గౌతమ్ కిచ్లు తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ జంట తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నారు. ప్రస్తుతం కాజల్‌కు 5వ నెల అని సమాచారం. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు 2020 అక్టోబర్ 30న ముంబైలో ఒక సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు. ఆ ఇద్దరూ ఏడేళ్లు స్నేహితులుగా ఉండి, వివాహానికి ముందు 3 సంవత్సరాలు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. Also read: 'ఖిలాడి' ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ కావాలంటే అంత కలెక్ట్ చేయాల్సిందే!
పని విషయానికి వస్తే, చిరంజీవితో కలిసి నటించిన 'ఆచార్య' విడుదల కోసం కాజల్ ఎదురుచూస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, పూజా హెగ్డే కూడా నటిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



