హరీశ్ శంకర్ దర్శకప్రస్థానానికి 16 ఏళ్ళు!
on Feb 9, 2022

`మిరపకాయ్`, `గబ్బర్ సింగ్`, `సుబ్రమణ్యం ఫర్ సేల్`, `దువ్వాడ జగన్నాథమ్`, `గద్దలకొండ గణేశ్` చిత్రాలతో తెలుగునాట సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందారు హరీశ్ శంకర్. తనదైన టేకింగ్ తో ప్రత్యేక అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తన `గబ్బర్ సింగ్` కథానాయకుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో `భవదీయుడు భగత్ సింగ్` తీసే పనుల్లో బిజీగా ఉన్నారు హరీశ్.
Also Read: మణిశర్మ సంగీతప్రస్థానానికి 30 వసంతాలు!
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 9 హరీశ్ శంకర్ కి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. సరిగ్గా పదహారేళ్ళ క్రితం ఇదే రోజున హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం `షాక్` విడుదలైంది. మాస్ మహారాజా రవితేజ, జ్యోతిక, టబు వంటి స్టార్స్ తో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. ఆర్జీవీ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ మంచి అంచనాల నడుమ విడుదలైనప్పటికీ.. కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయితే, ఓ డిఫరెంట్ ఎటెంప్ట్ గా నిలిచిన ఈ సినిమా కన్నడంలో `ప్రిన్స్` (2011) పేరుతో రీమేక్ కావడం విశేషం.
Also Read: ప్రభాస్‌తో మారుతి 'రాజా డీలక్స్'?
ఇక 2011 సంవత్సరంలో రవితేజ కాంబోలోనే వచ్చిన తన ద్వితీయ ప్రయత్నం `మిరపకాయ్`తో ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ చూశారు హరీశ్ శంకర్. ఆపై తనదైన బాణీలో ముందుకు సాగుతున్నారు. దర్శకుడిగా 16 ఏళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న హరీశ్.. మున్ముందు మరిన్ని విజయాలతో అలరించాలని ఆకాంక్షిద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



