'కళావతి' కోసం.. కీర్తిపై వాలిపోయిన మహేష్!
on Feb 9, 2022

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'సర్కారు వారి పాట'. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ఫిబ్రవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సాంగ్ కి సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
'కళావతి' అంటూ సాగే 'సర్కారు వారి పాట' ఫస్ట్ సింగిల్ పోస్టర్ బుధవారం విడుదల చేశారు. మహేష్, కీర్తిల అందంతో ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. కీర్తి వీపు భాగంలో మహేష్ తల వాల్చగా, కీర్తి సిగ్గుతో చిరునవ్వులు చిందించడం పోస్టర్ లో కనిపిస్తోంది. మహేష్, కీర్తి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే. పోస్టర్ లో ఈ పెయిర్ చాలా బాగుంది. కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరిందని అనిపిస్తోంది. పోస్టర్ లాగానే సాంగ్ తో, సినిమాతో ఈ పెయిర్ అలరిస్తుందేమో చూడాలి.

కాగా, 'కళావతి' సాంగ్ ప్రోమో ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సర్కారు వారి పాట మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



