'ఖిలాడి' ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ కావాలంటే అంత కలెక్ట్ చేయాల్సిందే!
on Feb 9, 2022

గతేడాది 'క్రాక్' సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న మాస్ మహారాజ రవితేజ.. ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖిలాడి' ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రాక్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఖిలాడి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది.
కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఖిలాడి సినిమా నైజాం ఏరియాలో రూ.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతుంది. ఆంధ్రాలో రూ.10 కోట్లు, సీడెడ్ లో రూ.3.50 కోట్లు బిజినెస్ జరుపుకున్న ఖిలాడి.. మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ. 21.50 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలు హక్కులు(రూ.2.10 కోట్లు), ఓవర్సీస్(రూ.1.2 కోట్లు కలిపి) ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.24.80 కోట్ల బిజినెస్ చేసింది ఖిలాడి. బాక్సాఫీస్ దగ్గర రూ.25 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేస్తే ఖిలాడి హిట్ గా నిలవనుంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఖిలాడి సినిమా ఈ శుక్రవారమే విడుదల కానుంది. పెన్ స్టూడియోస్ తో కలిసి హిందీలో ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ సొంతంగా విడుదల చేస్తుండటం విశేషం.
డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం పార్క్ హయత్ హోటల్ లో జరగనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



