
సల్మాన్ ఖాన్.. ఈ కట్ అవుట్ కి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఉన్న చరిష్మా గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. మూడు దశాబ్దాల నుంచి బాలీవుడ్ లో తన జెండా, అజెండాని చాటి చెప్తూ వస్తున్నాడు. డిసెంబర్ 4 న నయా మూవీ 'మాతృభూమి' తో వస్తున్నాడు. ఈ చిత్రం సెన్సార్ న్యూస్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకి సెన్సార్ నుంచి ప్రతికూలంగా వస్తున్న విషయాన్నీ చూస్తూనే ఉన్నాం.
ఈ నేపదాయంలో ఎట్టకేలకు మాతృభూమి సెన్సార్ అడ్డంకులను అధిగమించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ముంబై ప్రాంతీయ కార్యాలయం ఈ చిత్రానికి 'యూ/ఏ 16+' సర్టిఫికెట్ మంజూరు చేసింది. నెలల తరబడి సాగిన చర్చలు, వాయిదాలు, పేరు మార్పుల తర్వాత ఈ క్లియరెన్స్ రావడం సినిమా బృందానికి మరియు అభిమానులకు పెద్ద ఊరటనిచ్చే విషయం. సెన్సార్ సర్టిఫికెట్ ప్రకారం ఈ సినిమా నిడివి 154.12 నిమిషాలుగా ఉంది, అంటే సుమారు 2 గంటల 34 నిమిషాల 12 సెకన్ల పాటు ప్రేక్షకులను ఈ వార్ డ్రామా అలరించనుంది.
ఈ చిత్రం తొలుత 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' అనే టైటిల్‌తో ప్రకటించబడింది, ఆ తర్వాత 'మాతృభూమి'గా పేరు మార్చారు. 2020 జూన్ 15-16 తేదీలలో గాల్వాన్ లోయలో భారత్ మరియు చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మాతృభూమి రూపొందింది. ఆ ఘటనలో మన దేశానికి చెందిన 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 19 మంది సైనికులు వీరమరణం పొందారు. ఆ వీర సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలను ఆవిష్కరిస్తూనే, మరోవైపు కుటుంబానికి అండగా నిలిచే భావోద్వేగ కోణాన్ని కూడా దర్శకుడు అపూర్వ లఖియా ఈ చిత్రంలో చూపించారని సమాచారం.

సినిమా విడుదల ప్రయాణం అంత సులభంగా సాగలేదు. వాస్తవానికి ఈ చిత్రాన్ని నవంబర్ 20న థియేటర్లలో విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) పనులు పెద్ద స్థాయిలో ఉండటం, నటి చిత్రాంగదా సింగ్‌కు గాయం కావడం వంటి కారణాలతో షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ షెడ్యూల్‌పై ప్రభావం పడింది.
ఇది కూడా చదవండి: అతనితో పనిచెయ్యడం పీడకల: స్టార్ యాక్టర్ పై దియామీర్జా కీలక వ్యాఖ్యలు: ఇంకా ఏం చెప్పిందంటే!
అంతేకాకుండా భారత రక్షణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు దర్శకుడు అపూర్వ లఖియా దాదాపు 40 శాతం సినిమాను రీషూట్ చేసి, కొన్ని కల్పిత అంశాలు, రొమాంటిక్ సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ స్టోరీని జోడించి కొత్త వెర్షన్‌ను సిద్ధం చేశారు. విజువల్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ సమయం తీసుకున్నారని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు.
సెన్సార్ బోర్డు మరియు సంబంధిత ఏజెన్సీలు సినిమాలో ఎలాంటి అభ్యంతరకర అంశాలను గుర్తించలేదని, ఎలాంటి కట్స్ లేకుండానే సర్టిఫికెట్ ఇచ్చాయని సల్మాన్ గతంలోనే వెల్లడించారు. భారత్-చైనా దౌత్య సంబంధాల నేపథ్యంలో సినిమాలోని అంశాలపై కొన్ని సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ, ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.

సల్మాన్ ఖాన్‌కు జోడీగా చిత్రాంగదా సింగ్ నటించగా, ముఖేష్ రిషి, అంకుర్ భాటియా, జైన్ షా, అభిలాష్ చౌదరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిమేష్ రేష్మియా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా జియో స్టూడియోస్ విడుదల చేస్తోంది. అన్ని అడ్డంకులను దాటుకుని 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
మీకు నచ్చవచ్చు:వైరల్ గా మారిన సంజయ్ దత్ గత జన్మ!
మీకు నచ్చవచ్చు :రామాయణ మూవీపై హిందూ జాగృతి సమితి ఫైర్!
[Salman Khan, Maatrubhumi, Apoorva Lakhia, Tollywood, Bollywood]






