
మై బాక్స్ ఆఫీస్ కా కింగ్ అంటూ రాముడు తన నయా 'రామాయణ'తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ప్రెజెంట్ ఫిగర్ 1500 కోట్లు. అది కూడా జస్ట్ థర్టీన్ డేస్. దీంతో అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులు, రామ భక్తులు గర్వంతో కాలర్ ఎగరేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్లందరికీ చిన్న పాటి షాక్.
రామాయణపై హిందూ జాగృతి సమితి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. మహర్షి వాల్మీకి రాసిన అసలు రామాయణ గ్రంథంలోని అనేక కీలక ఘట్టాలను సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో వక్రీకరించారని ఆ సంస్థ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా రావణుడి రోల్ ని చిత్రీకరించిన తీరుపై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పేదలకు బంగారు ఇళ్లు ఇచ్చి సహాయం చేసే వ్యక్తిగా రావణుడిని చూపించడం, బానిసత్వం నుంచి ప్రజలను విడిపించే హీరోలా ఎలివేట్ చేయడం ద్వారా రావణుడిని వైభవీకరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
.webp)
రావణుడి సైన్యం ముందు శ్రీరాముడు, లక్ష్మణుడు వెనక్కి తగ్గినట్లు చూపించడం, లక్ష్మణుడిని తక్కువ చేసి చూపడం, సీత రాక్షసులతో పోరాడే సన్నివేశాలు అసలు ఇతిహాసానికి విరుద్ధంగా ఉన్నాయని హిందూ జాగృతి సమితి ఆరోపించింది. ఈ సినిమా ఒక ప్రత్యేక భావజాలాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ, వెంటనే సినిమా ప్రదర్శనను నిలిపేయాలని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది.
ఇది కూడా చదవండి:పవన్ కళ్యాణ్ పై కోట రుక్మిణి కీలక వ్యాఖ్యలు: ఆయన్ని ఎందుకు లాగుతున్నారు!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పై కూడా సంస్థ ప్రతినిధులు ప్రశ్నలు సంధించారు. ఇతర మతాల మనోభావాలను గౌరవించే సెన్సార్ బోర్డు, హిందువుల మనోభావాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. మరోవైపు దర్శకుడు నితీష్ తివారి గతంలో సీత పోరాట సన్నివేశంపై స్పందిస్తూ, వాల్మీకి రామాయణంతో పాటు ఇతర ప్రాంతీయ, ప్రత్యామ్నాయ సాహిత్య సంప్రదాయాల ఆధారంగానే ఈ కథను రూపొందించామని వివరణ ఇచ్చారు.

గతంలో రామాయణ నేపథ్యంలో వచ్చిన 'ఆదిపురుష్' విడుదలైనప్పుడు ఎదురైన వ్యతిరేకత 'రామాయణ' విషయంలో మొదట్లో కనిపించకపోయినా, ఇప్పుడు ఒక్కసారిగా వివాదం రాజుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మీకు నచ్చవచ్చు:కల్ట్ ఓటిటి డేట్ ఇదే!
మీకు నచ్చవచ్చు :ధోనితో బ్రేక్ అప్ చేసుకున్న ప్రముఖ నటి!
[Ramayana, Ravana Glorification, Hindu jaguthi samithi, Ranbir Kapoor, Yash]






