
జూనియర్ ఎన్టీఆర్ సినిమాల టైటిల్స్‌లో తాతగారి సినిమాల పేర్లు కలిసొచ్చేలా చూసుకుంటున్నారా? గతంలో తాత ఎన్టీఆర్ నటించిన ఆల్‌టైమ్ క్లాసిక్ ‘లవకుశ’ టైటిల్‌ను గుర్తుచేసేలా ‘జై లవకుశ’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న తారక్.. ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జై లవకుశ’లో మూడు విభిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి తన తాత నటించిన క్లాసిక్ సినిమా టైటిల్‌లోని పదాలను కలుపుతూ కొత్త సినిమా చేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఈసారి ‘దానవీరశూరకర్ణ’ నుంచి ‘దానవీరశూర’ అనే పేరును తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకే ‘దానవీరశూర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

నందమూరి తారక రామారావు నటించిన ‘దానవీరశూరకర్ణ’ తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రం. అలాంటి క్లాసిక్ పేరులోని మూడు పదాలను తీసుకొని ‘దానవీరశూర’గా టైటిల్ పెడితే నందమూరి అభిమానులకు అదొక ప్రత్యేకమైన కనెక్షన్ అవుతుంది.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌ను చూసి మిగతా స్టార్స్ మారతారా.?
ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ కామెడీ టైమింగ్‌కు తారక్ ఎనర్జీ తోడైతే ఎలాంటి ఎంటర్‌టైనర్ వస్తుందనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. అలాంటి సినిమాకు ‘దానవీరశూర’ అనే టైటిల్ నిజంగానే ఖరారైతే నందమూరి అభిమానులకు మరో సర్‌ప్రైజ్ అవుతుంది.

అయితే ఈ టైటిల్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే ‘దానవీరశూర’ పేరుతోనే ఎన్టీఆర్–అనిల్ రావిపూడి సినిమా రాబోతోందా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మీకు నచ్చవచ్చు:
వారణాసి వాయిదా.. బాల్ రాజమౌళి కోర్టులో లేదా.?
ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.!
[Daana Veera Soora, Jr NTR, Anil Ravipudi, Dragon]





