'శానా కష్టం'గా పాడిన గీతా మాధురి! 'రంగీలా' సాంగ్ స్టైల్‌లో మొదలైంది!!
on Jan 3, 2022

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తుండగా, కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న 'ఆచార్య' మూవీ ఫిబ్రవరి 4న విడుదలకు రెడీ అవుతోంది. రామ్‌చరణ్, పూజా హెగ్డే ఒక జంటగా నటించిన ఈ మూవీలోని "శానా కష్టం" పాటను ఈరోజు రిలీజ్ చేశారు. మణిశర్మ బాణీలు సమకూర్చగా, భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఈ పాటను చిరంజీవి, రెజీనా కసాండ్రాపై చిత్రీకరించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ సమకూర్చిన ఈ పాటను చాలా అందంగా తన కెమెరాతో తీశాడు సినిమాటోగ్రాఫర్ తిరునావుక్కరసు.
అంతా బాగా ఉంది కానీ సంగీత ప్రియులు, అభిమానులు ఆశించిన రీతిలో పాట లేదనే అభిప్రాయం కలుగుతోంది. ముఖ్యంగా "కల్లోలం కల్లోలం ఊరూ వాడా కల్లోలం" అంటూ గీతా మాధురి పాడుతుంటే, రామ్‌గోపాల్ వర్మ బ్లాక్‌బస్టర్ మూవీ 'రంగీలా'లోని "యాయిరే యాయిరే వారెవా ఇది ఏంజోరే" పాట గుర్తుకురాక మానదు. 'రంగీలా' పాటను అనుకరిస్తూ గీతామాధురి పాడిందని ఎవరికైనా అనిపిస్తే తప్పు పట్టలేం. పైగా గీతామాధురి వాయిస్ కూడా ఆ పెప్పీ నంబర్‌కు సూట్ కాలేదని చెప్పాలి.
Also read: సిరి, షణ్ణు తెలిసే చేశారు.. మానస్ బయటపెట్టేశాడు!
ఒకవైపు గీతామాధురి వాయిస్ శానా కష్టంగా డల్‌గా వినిపిస్తుంటే, మరోవైపు తన హై పిచ్ వాయిస్‌తో ఆ సాంగ్‌ను లేపడానికి కృషి చేశాడు రేవంత్. అతను పాడుతున్నంత సేపూ ఊపుగా అనిపించిన పాట, గీతామాధురి పాడుతుంటే డౌన్ అవుతున్నట్లు అనిపించింది. హస్కీ వాయిస్ ఉన్నట్లయితే ఈ సాంగ్ ఇప్పుడు వినిపిస్తున్న దానికంటే బాగా ఉంటుందనేది నిజం.
Also read: శివ పార్వతిలో 'టక్కరి దొంగ' మూవీ ఫస్ట్ డే చూశా.. ఇలా జరగడం బాధాకరం!
ఇటీవల 'పుష్ప' మూవీలోని "ఊ అంటావా మావా ఉఊ అంటావా" పాట హిట్టవడంలో ఇంద్రావతి చౌహాన్ వాయిస్సే కీలక పాత్ర పోషించిందని మనకు తెలుసు. ఆ తరహాలో వాయిస్ ఉన్నట్లయితే "శానా కష్టం" పాట మరో రేంజ్‌లో ఉండేది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



