నిధికి నిరుడు కోలీవుడ్.. ఈ ఏడాది టాలీవుడ్!
on Jan 3, 2022

`ఇస్మార్ట్ శంకర్`తో తెలుగునాట తొలి బ్లాక్ బస్టర్ కొట్టింది గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ తరువాత టాలీవుడ్ లో మరో చిత్రంతో సందడి చేయని ఈ హాట్ బ్యూటీ.. ఈ ఏడాది రెండు సినిమాలతో పలకరించబోతోంది. ఆ చిత్రాలే.. `హీరో`, `హరిహర వీరమల్లు`. `హీరో`లో సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ కథానాయకుడిగా నటించగా.. `హరిహర వీరమల్లు`లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో దర్శనమివ్వనున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా `హీరో` చిత్రానికి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తెలుగులో నిధికి ఇదే ఫస్ట్ పొంగల్ రిలీజ్. అయితే, కోలీవుడ్ లో మాత్రం గతేడాది జనవరి 14న రెండు తమిళ చిత్రాలతో పలకరించింది. `ఈశ్వరన్` (శింబు), `భూమి` (`జయం` రవి) పేర్లతో రూపొందిన సదరు సినిమాలు మిస్ అగర్వాల్ కి మిశ్రమ ఫలితాలను అందించాయి. మరి.. కోలీవుడ్ లో అంతగా కలిసిరాని పొంగల్ సీజన్.. టాలీవుడ్ లోనైనా నిధికి అచ్చొస్తుందేమో చూడాలి.
మరోవైపు.. పవన్, నిధి జంటగా నటిస్తున్న `హరిహర వీరమల్లు` ఈ క్యాలెండర్ ఇయర్ లోనే థియేటర్స్ లో ఎంటర్టైన్ చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



