విడాకుల వార్తలను ఖండించిన సంజన
on Jan 4, 2022

కన్నడ తార సంజనా గల్రాని తెలుగులోనూ పాపులర్. గ్లామరస్ యాక్ట్రెస్‌గా ఆమె తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈమధ్య డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలై, బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. రీసెంట్‌గా ఆమె పర్సనల్ లైఫ్ గురించి మీడియాలో పలు రకాల రిపోర్టులు వచ్చాయి. వాటిపై ఆగ్రహం వ్యక్తం చేసింది సంజన. ఎలాంటి ప్రూఫ్‌లు లేకుండా తన గురించి కథలు అల్లడంపై తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆగ్రహాన్ని, ఆవేదనను తెలిపింది.
తన భర్త నుంచి విడాకులు కోరుతూ సంజన కోర్టుకు వెళ్లిందంటూ ఒక కన్నడ న్యూస్‌పేపర్ రీసెంట్‌గా ఒక కథనం రాసింది. గత ఏడాది ఆమె తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్, బెంగళూరుకు చెందిన డాక్టర్ అజీజ్ పాషాను పెళ్లాడింది. ఏడాది గడిచేలోగా ఆ ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని ఆ పేపర్ రాసుకొచ్చింది. ఆ రిపోర్టును ఖండించింది సంజన. "నాకు సంబంధించి ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఏ పబ్లిషర్ అయినా ప్రచురించే చెత్తను ఇక ఏమాత్రం నేను సహించను." అని ఆమె పోస్ట్ చేసింది.
బెంగళూరుకు చెందిన సంజన తరచుగా రాంగ్ రీజన్స్‌తో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తన లైఫ్‌లో పలు వివాదాలు, కేసులను ఆమె ఎదుర్కొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



