శివ పార్వతిలో 'టక్కరి దొంగ' మూవీ ఫస్ట్ డే చూశా.. ఇలా జరగడం బాధాకరం!
on Jan 3, 2022

హైదరాబాద్ లోని శివ పార్వతి థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో థియేటర్ కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా.
శివ పార్వతి థియేటర్ ఘటనపై నేచురల్ స్టార్ నాని స్పందించాడు. శివ పార్వతి థియేటర్ లో అగ్ని ప్రమాదం ఘటన బాధ కలిగించిందని అన్నాడు. ఆ థియేటర్ లో 'టక్కరి దొంగ' సినిమా విడుదలైన మొదటి రోజే చూశానని గుర్తుచేసుకున్నాడు. అలాగే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిసి సంతోషిస్తున్నాను అని నాని చెప్పుకొచ్చాడు.

కాగా, శివ పార్వతి థియేటర్ లో నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను ప్రదర్శిస్తున్నారు. అయితే ఆదివారం సెకండ్ షో పూర్తయిన తరువాత థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. అయితే పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో అప్పటికే జరగాల్సిన ఆస్తి నష్టం జరిగిపోయింది. అయితే సెకండ్ షో పూర్తయిన తరువాత ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



