
సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తూ బిజీగా ఉండాలని చాలామంది హీరోయిన్స్ కోరుకుంటారు. కానీ నిత్యా మేనన్ ఆలోచనా విధానం మాత్రం కాస్త భిన్నం. వరుసగా సినిమాలు చేయకుండా మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ ఉంటారు. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గాయా? లేక సినిమాలకు దూరంగా ఉంటున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తుంటాయి. అయితే తన బ్రేక్‌ల వెనుక ఉన్న అసలు కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిత్యా మేనన్ బయటపెట్టారు.
నిత్యా మేనన్ ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వివేక్ ఒబెరాయ్‌తో కలిసి నటించిన ఈ మూవీ డిసెంబర్ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడం వెనుక తన ఆలోచనలను పంచుకున్నారు.
జీవితం అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదని నిత్య చెబుతున్నారు. పని అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని, దాని బయట కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమాల నుంచి విరామం తీసుకున్నప్పుడు ఇంట్లోనే ఉంటూ కొత్త విషయాలు నేర్చుకుంటానని తెలిపారు. తనకు అలాంటి బ్రేకులు అవసరమని, ఒక యంత్రంలా నిరంతరం పనిచేయడం తన వల్ల కాదని స్పష్టం చేశారు.

నిజమైన పువ్వు తన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి ఎన్నో విషయాలను గ్రహిస్తుందని, తాను కూడా అలాగే ఉంటానని నిత్య చెప్పారు. కెమెరా ముందు కృత్రిమంగా నటించడం తనకు సాధ్యం కాదని, పాత్రలోని భావోద్వేగాలు తనలో నుంచి సహజంగా రావాలని పేర్కొన్నారు. అందుకే ప్రతి సినిమా తర్వాత తనను తాను తిరిగి సిద్ధం చేసుకోవడానికి సమయం తీసుకుంటానని వివరించారు.
ఇది కూడా చదవండి: 18 ఏళ్లైనా ఆ ప్రేమ తగ్గలేదు.. సమీరారెడ్డి కామెంట్స్ వైరల్.!
‘‘నేను ఒక ఆర్టిస్టును.. వర్కర్‌ను కాదు. నా ఆరోగ్యం బాగోలేకపోతే నటనలో వంద శాతం ఎలా ఇవ్వగలను? తెరపై ఒక పాత్ర సహజంగా కనిపించడం వెనుక చాలా సన్నాహాలు ఉంటాయి. ఆ శ్రమ నుంచి కోలుకోవడానికి, మళ్లీ కొత్త ఉత్సాహంతో పని చేయడానికి నాకు సమయం కావాలి’’ అన్నది నిత్యా మేనన్ అభిప్రాయం.

సినిమాల సంఖ్య పెంచుకోవడం కంటే, తాను చేసే ప్రతి పాత్రకు న్యాయం చేయడమే ముఖ్యమని నిత్యా మాటలను బట్టి అర్థమవుతోంది. కెరీర్‌లో గ్యాప్ వస్తుందనే భయం లేకుండా తనకు నచ్చిన విధంగా ముందుకు సాగుతున్న ఆమె నిర్ణయంపై అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
రష్మిక ‘మైసా’ వాయిదా.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.!
అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం.. ఆసుపత్రిలో జబర్దస్త్ కమెడియన్లు!
[Nithya Menen, Interview, Career Breaks, Mr and Mrs Grey, Vivek Oberoi]





