Home

»

Latest News

ర‌ష్మిక ఫ్యాన్స్‌కు షాక్‌, ‘మైసా’ వాయిదా.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.!

Nov 22, 2026 2:54PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మైసా’. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, పాటలతో సినిమాపై ఆసక్తి పెంచిన మేకర్స్.. తాజాగా అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. నవంబర్ 27న థియేటర్లలోకి రావాల్సిన ‘మైసా’ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ సినిమా వాయిదా పడటానికి గల కారణాన్ని నిర్మాణ సంస్థ అన్‌ఫార్ములా ఫిల్మ్స్ వెల్లడించింది. ప్రస్తుతం తెలుగు సినిమా సాంకేతికంగా కొత్త స్థాయికి చేరుకుంటోందని, అదే స్థాయిలో ‘మైసా’ను కూడా అత్యున్నత ప్రమాణాలతో రూపొందించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ప్రేక్షకులకు గొప్ప బిగ్‌స్క్రీన్ అనుభూతిని అందించేందుకు, సినిమా విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఇప్పటికే సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘ఒసేయ్ రాములమ్మ’ పాటకు మంచి స్పందన వచ్చింది. ఈ పాటలో విజయశాంతి నటించిన పాత ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రంలోని ఐకానిక్ పాటను మళ్లీ రూపొందించారు. అయితే సినిమా వాయిదా పడటంతో రష్మిక అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు.

రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక గోండు మహిళగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

 

 

[RashmikaMandanna, MysaaMovie, MysaaReleasePostponed, RawindraPulle, OseyRamulamma] 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com