Home

»

Latest News

డింపుల్ హయాతికి క్షమాపణలు చెప్పిన సంపత్ నంది.. అసలు ఏం జరిగిందంటే.?

Nov 23, 2026 10:57AM

సినిమా వేడుకల్లో నటీనటులపై దర్శకులు ప్రశంసలు కురిపించడం సహజమే. కానీ ఓ దర్శకుడు మాత్రం తన సినిమాలో నటించిన నటికి వేదికపైనే క్షమాపణలు చెప్పారు. ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయానంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. ‘భోగి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంపత్ నంది. ఆయన క్షమాపణలు చెప్పింది నటి డింపుల్ హయాతికి. ప్రస్తుతం ఈ సంఘటన టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

శర్వానంద్‌ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భోగి’. నవంబర్ 22న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సంపత్ నంది.. డింపుల్ హయాతికి తాను ఇచ్చిన ఓ హామీని గుర్తుచేసుకున్నారు. ఆమెను ఒక పాటలో అందంగా, హుందాగా చూపిస్తానని మాట ఇచ్చానని, కానీ కొన్ని కారణాల వల్ల అలా చేయలేకపోయానని చెప్పారు.

రాజ్ కపూర్ సినిమాల్లోని హీరోయిన్ల తరహాలో డింపుల్‌ను చూపించాలని అనుకున్నానని సంపత్ నంది తెలిపారు. ఎలాంటి స్కిన్ షో లేకుండా, అసభ్యకరమైన కెమెరా యాంగిల్స్‌కు తావివ్వకుండా ఆమె అందం, అభినయాన్ని హైలైట్ చేయాలనుకున్నానని చెప్పారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాటను తెరకెక్కించలేకపోయానని చెబుతూ డింపుల్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అంతేకాదు.. భవిష్యత్తులో మరోసారి కలిసి పనిచేసే అవకాశం వస్తే తన ఆలోచనను తప్పకుండా అమలు చేస్తానని హామీ ఇచ్చారు.

ఇక సంపత్ నంది మాటలకు డింపుల్ హయాతి కూడా స్పందించారు. తనను చాలామంది గ్లామర్ కోణంలోనే చూశారని, కానీ తన శరీరాన్ని కాకుండా కళ్లలోని భావాలను గుర్తించి మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు సంపత్ నందేనని ప్రశంసించారు. ఆయన తనకు ఇచ్చిన ప్రాధాన్యత, గౌరవం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: నిత్యా మేనన్‌ సంచలన నిర్ణయం.. అసలు కారణమిదే.!

గతంలో సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ‘సీటీమార్’ సినిమాలోనూ డింపుల్ హయాతి నటించారు. అందులోని ‘పెప్సీ ఆంటీ’ పాట కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ‘భోగి’లో మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఈ సినిమాలో డింపుల్ కీలక పాత్రలో కనిపించనుండగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. శర్వానంద్‌ను మునుపెన్నడూ చూడని రా అండ్ రస్టిక్ మాస్ అవతార్‌లో చూపించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, కేకే రాధామోహన్ నిర్మించారు. నవంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చవచ్చు: 
వృషకర్మ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
18 ఏళ్లైనా ఆ ప్రేమ తగ్గలేదు.. సమీరారెడ్డి కామెంట్స్ వైర‌ల్‌.!

 

 

 

[Sampath Nandi, Apology, Dimple Hayathi, Bhogi Movie, Sharwanand]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com