Home

»

Latest News

పాకెట్ రాకెట్స్: గ్యాబ్లింగ్‌ సినిమాతో సర్ప్రైజ్ చేసిన నిహారిక కొణిదెల.!

Oct 29, 2026 11:35AM

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. ఈ సినిమాకు రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో కమిటీ కుర్రోళ్ళు ఫేమ్ త్రినాథ్ వర్మ, డెబ్యూ హీరో నిర్మల్ హీరోలుగా.. శుభం ఫేమ్ శ్రియా కొంతం హీరోయిన్‌గా నటిస్తున్నారు. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌‌ని, కాన్సెప్ట్ పోస్టర్‌ని తాజాగా రివీల్ చేశారు.

విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్‌లోకి దిగడం, ఆ తర్వాత ఆ కుర్రాడి జీవితంలో ఎదురైన పరిస్థితుల్ని ‘పాకెట్ రాకెట్స్’లో ఎంతో ఆసక్తికరంగా చూపించబోతోన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. త్వరలో టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. గ్యానీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

 

 

 

[Pocket Rockkets Movie, Niharika Konidela, Pink Elephant Pictures, Pocket Rockets Movie, Committee Kurrollu, Trinadh Varma, Shriya Kontham, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com