Home

»

Latest News

టాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు కన్నుమూత!

Oct 29, 2026 10:43AM

 

షార్ట్ న్యూస్ 

టాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ నిర్మాత  కన్నుమూత!

తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ సీనియర్ సినీ నిర్మాత, 'జగపతి మూవీ క్రియేషన్స్' అధినేత జె.వి.ఆర్. చలసాని వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఒక సాధారణ హాల్ బుకింగ్ క్లర్క్‌గా తన జీవితాన్ని స్టార్ట్ చేసి సినిమా రంగంపై మక్కువతో  ఎన్నో కష్టనష్టాలని ఎదుర్కొంటూ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా ఎదిగారు.


  'జగపతి మూవీ క్రియేషన్స్` బ్యాన‌ర్ ని స్థాపించి తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో వినోద్ కుమార్ హీరోగా వచ్చిన యాక్షన్ డ్రామా `నేటి దౌర్జన్యం` , బి. విఠలాచార్య దర్శకత్వంలో భక్తిరస చిత్రం `కరుణించిన కనకదుర్గ`  వంటి చిత్రాలు ఆయన నిర్మాణ ప్రతిభకి  నిదర్శనంగా నిలిచాయి.2015లో స్వీయ దర్శకత్వంలో వచ్చిన బాల‌ల చిత్రం దాన‌వీరశూర‌క‌ర్ణ‌ పెద్ద విజ‌యం సాధించింది. ఎన్టీఆర్ మనవడు నందమూరి జానకి రామ్ కుమారుడు మాస్టర్ ఎన్టీఆర్‌  శ్రీకృష్ణుడిగా కనిపించాడు. ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా.. 2015 సంవత్సరానికి గాను `ఉత్తమ బాలల‌ చిత్రం`గా నంది అవార్డుని అందుకోవడం విశేషం.  
 

ప్రస్తుతం తన సొంత ఊరు 'విజయవాడ'లో వృద్ధాశ్రమాన్ని నడుపుతూ పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. సినిమా అభివృద్ధి కోసం కూడా తన వంతు పాటు పడ్డారు. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే సినిమాని ప్రాణంగా భావించే వాళ్ళు చనిపోతే మళ్ళీ సినిమాని తన ఆయువుగా మార్చుకోవడానికి జన్మిస్తారని. మరి ఈ పాటికే ఎక్కడో పుట్టిన వెంకటేశ్వరరావు గారు తన పసి చిరు ఆలోచనలతో సినిమాని మళ్ళీ ఎలా ఏలాలి తన ప్రతిభ ఎలా చాటలో అనే పనిలో ఉండే ఉంటారు.ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ గా కూడా రికార్డు ఉంది మరి. 

 

[Jvr Chalasani Venkateswara Rao Passes Away, JVR Chalasani Venkateswara Rao, Tollywood producer passes away, Jagapathi Movie Creations, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com