
హమ్మయ్య.. మెగా ఫ్యాన్స్ లో ఉన్న ఎగ్జైట్మెంట్ తో కూడిన టెన్షన్ కి కొంచం రిలీఫ్ వచ్చినట్లయింది. అదేనండి ఆర్ సి 17 లో చరణ్ తో జోడి కట్టే భామ ఎవరా అని! మరి సుకుమార్, చరణ్ కాంబో అంటే మాటలా చెప్పండి. పైగా రంగస్థలం తర్వాత వస్తున్న కాంబో, అది కూడా పాన్ ఇండియా బంపర్ హిట్ పుష్ప సిరీస్ తర్వాత సుకుమార్ మూవీ. దీన్ని బట్టి హీరోయిన్ కట్ అవుట్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో క్లియర్ కట్ గా తెలుస్తుంది కదు .
విశ్వసనీయ సమాచారం ప్రకారం ధురంధర్ బ్యూటీ 'సారా అర్జున్' కి మేకర్స్ లుక్ టెస్ట్ నిర్వహించారని సమాచారం. మేకర్స్ సంతృప్తిగా కూడా ఉన్నారని 'సారా' ఫిక్స్ అనే మాటలు కూడా వినపడుతున్నాయి. మరి సారా నిజమైతే ఆర్ సి 17 కి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ముఖ్యంగా పొడవాటి జుట్టుతో, కొత్త లుక్లో కనిపించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చరణ్ తన క్యారక్టర్ కోసం రూపురేఖల్లో మార్పులు చేసుకున్నారనే ప్రచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే, ఈ లుక్కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ఒకే ఇంట్లో కోడళ్ల మరణాలకు సమాధానం: మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2... తెలుగులోనూ స్ట్రీమింగ్!

ప్రస్తుతానికైతే ప్రీ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. ఆర్ సి 17 ని నిర్మిస్తున్న మైత్రి అధినేతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ రీసెంట్ గా ఒక కార్యక్రమంలో మాట్లాడుతు ఈ నెల చివరిలో ప్రారంభం చేస్తామని అన్నాడు. మరి నెల అయిపోతుంది కాబట్టి ఆ వాతావరణం ఏమి కనిపించడం లేదు. నవంబర్ 1న నిర్వహించనున్నట్లు కొత్త ప్రచారం.
[Rc17 Sara Arjun Look Test Completed, RC 17 cast, Ram Charan, Sukumar, Sara Arjun, RC17 movie, Tollywood news, Look test completed Telugu Movie News, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]






