Home

»

Latest News

ఒకే ఇంట్లో కోడళ్ల మరణాలకి సమాధానం - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2... తెలుగులోనూ స్ట్రీమింగ్

Oct 29, 2026 11:03AM

 

మనలో మన మాట పక్క ఫోటోలో చూస్తున్న మూవీ మామూలు మూవీ కాదు. క్షణం క్షణం  ఉత్కంఠతతో సాగే సూపర్  సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్. తెలుగులో కూడా వచ్చేసింది.  అదే 'అయ్యన మనే సీజన్ 2'. 


ప్రముఖ డిజిటల్ ఓటీటీ వేదిక అయిన జీ5 (Zee5) వేదికగా ఈ రోజు నుంచి  స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. మొదటి సీజన్ సృష్టించిన అపూర్వ విజయం, విమర్శకుల ప్రశంసలు మరియు ఊహించని ఉత్కంఠభరితమైన మలుపుల తర్వాత ఇప్పుడు ఈ రెండో భాగంపై దేశవ్యాప్తంగా ఉన్న థ్రిల్లర్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. మొత్తం 6 ఎపిసోడ్స్‌తో స్ట్రీమ్ అవుతోన్న మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌ ఫస్ట్ సీజన్‌లో మిగిలిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 'అయ్య ఇంట్లో ప్రతీ ఒక్కరూ ఒక ముసుగు ధరించి ఉంటారు. ప్రతీ ముసుగు వెనుక ఒక కథ దాగి ఉంటుంది. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో? బయటపడే సమయం ఇది.' అంటూ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. 

ఓ గొప్ప ఇంట్లో అడుగు పెట్టిన ముగ్గురు కోడళ్లు అనుమానాస్పద స్థితిలో మరణిస్తారు. కుల దేవత శాపం అని ఆ ఫ్యామిలీతో పాటు ఆ ఊరి గ్రామస్థులు కూడా నమ్ముతుంటారు. ఆ ఇంటికి వచ్చిన కొత్త కోడలు ఆ మరణాల వెనుక మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తుంది. క్షణ క్షణం ట్విస్టులతో సాగుతుంది . ఇంతకంటే ఎక్కువగా చెప్తే బాగోదు. వెంటనే చేసి సినీ మజా పొందండి. ఈ వెబ్ సిరీస్ కథాంశం విషయానికి వస్తే, ఒకే ఇంట్లో జరిగిన కోడళ్ల మరణాలు మరియు ఆ కుటుంబానికి సంబంధించిన భయంకరమైన నిజాలు ఈ కథలో ప్రధాన కేంద్ర బిందువుగా నిలుస్తాయి. పాతకాలపు పెద్ద ఇల్లు, ఆ ఇంటి గోడల వెనుక కాలగర్భంలో కలిసిపోయిన చీకటి రహస్యాలు, ఎవరికీ అంతుచిక్కని వరుస మరణాలు ప్రేక్షకులను సీట్లలో కదలకుండా కూర్చోబెడతాయి. మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో, సరిగ్గా అక్కడి నుంచే ఈ రెండో సీజన్ కథ కొనసాగుతుంది. "ఆ రాత్రి అసలు అక్కడ ఏం జరిగింది?" అనే ఎన్నో ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు ఈ కొత్త భాగంలో స్పష్టమైన సమాధానాలు లభించనున్నాయి. 

 

  ఇది కూడా చదవండి: టాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు కన్నుమూత!

 


ముఖ్యంగా ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ప్రసిద్ధ నటి ఖుషి రవి, అక్షయ్ నాయక్ తమ అద్భుతమైన సహజ నటనతో మరోసారి ప్రేక్షకులను కథలో లీనం అయ్యేలా చేశారు.   ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను శ్రుతి నాయుడు ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత రిచ్ వాల్యూస్‌తో నిర్మించగా, దర్శకుడు రమేష్ ఇందిరా దీన్ని ఎక్కడా తడబాటు లేకుండా అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ యొక్క మరో ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా తెలుగు, కన్నడ, తమిళం మరియు హిందీ అనే మొత్తం 4 ప్రధాన భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబడింది. 

 

 

[Ayyana Mane Season 2 Ott Release, Ayyana Mane Season 2, Kushee Ravi, Zee5 OTT, Telugu web series, suspense thriller, mystery web series, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com