కీర్తి సురేశ్ ‘గుడ్ లక్ సఖి’ సోలో రిలీజ్
on Jan 21, 2022
జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్ షూటర్‌గా కనిపించనుంది. నగేశ్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది.
Also read: చైతూతో విడాకుల పోస్ట్‌ను తొలగించిన సామ్.. ఇద్దరూ మళ్లీ కలుస్తున్నారా?
తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. రిపబ్లిక్ డే అయిన రెండు రోజులకు అంటే జనవరి 28న గుడ్ లక్ సఖి సినిమా విడుదల కానుంది. ఇక గుడ్ లక్ సఖి సినిమాకు పోటీగా మరే చిత్రం లేకపోవడంతో మేకర్స్ మరింతగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. ఇక సినిమా విడుదలకు వారం రోజులే ఉండటంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు.
Also read: సుమంత్ సినిమా నేరుగా ఓటీటీలోకి!
నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న `గుడ్ లక్ సఖి` సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా, చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
