Home

»

Latest News

సుమంత్ సినిమా నేరుగా ఓటీటీలోకి!

Jan 21, 2022

 

సుమంత్ హీరోగా న‌టించిన లేటెస్ట్ ఫిల్మ్ 'మ‌ళ్లీ మొద‌లైంది'. నైనా గంగూలీ, వ‌ర్షిణి సౌంద‌ర్‌రాజ‌న్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ‌వుతోంది. ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల్ని 'జీ 5' చేజిక్కించుకుంది. ఫిబ్ర‌వ‌రిలో 'మ‌ళ్లీ మొద‌లైంది' మూవీని త‌మ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేయ‌నున్న‌ట్లు శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో ఆ సంస్థ తెలిపింది.

విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా 'మళ్ళీ మొదలైంది'. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో ముఖ్య కథానాయికగా నైనా గంగూలీ నటించారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తెలుగు  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన 'ఎలోన్ ఎలోన్'కు అద్భుత స్పందన లభించింది. అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ మూవీని ఈడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రాజ‌శేఖ‌ర్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవో.

Aslo read: వ‌రుణ్‌తేజ్‌తో పెళ్లి వ‌దంతులు.. ఫొటోతో ఆన్స‌ర్ ఇచ్చిన లావ‌ణ్య‌!

'జీ 5' ఓటీటీ లక్ష్యం ఒక్కటే... వీక్షకులకు వినోదం అందించడమే. అది కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా... ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డమే లక్ష్యంగా 'జీ 5' ఓటీటీ ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలను అందిస్తోంది. లేటెస్టుగా మరో సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది.

Also read: 103 కేంద్రాలలో 'అఖండ' యాభై రోజుల జైత్ర‌యాత్ర‌!

'జీ 5' ఓటీటీలో ఈ నెల 21న 'లూజర్' సీజన్ 2 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'మళ్ళీ మొదలైంది'తో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com