సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు!
on Dec 14, 2021

సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నిత్యావసర ధరలను తగ్గించాల్సింది పోయి, ఇలా వినోదం కోసం వందల కోట్లతో నిర్మిస్తున్న సినిమాలపై ప్రభుత్వం పెత్తనం చేయాలనుకోవడం కరెక్ట్ కాదని.. దీనివల్ల సినీపరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా హైకోర్టులో సైతం జగన్ సర్కార్ కి చుక్కెదురైంది.
Also Read: లాఠీఛార్జ్ లో గాయపడిన ఫ్యాన్స్.. బన్నీ రియాక్షన్!
సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 35 ని వ్యతిరేకిస్తూ థియేటర్ల యజమానులు హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ప్రభుత్వం ఇచ్చిన జీవోని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. సినిమా టికెట్ల రేట్లను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదన్న థియేటర్ల యజమానులు తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. సినిమా టికెట్ల రేట్ల పెంపుకు వెసులుబాటు కల్పించింది. కోర్టు తీర్పుతో ఏపీలో పాత విధానంలోనే సినిమా టికెట్ల రేట్లు ఉండనున్నాయి.
Also Read: బన్నీకి జక్కన్న స్మూత్ వార్నింగ్!
సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోని కోర్టు రద్దు చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. అన్ని సినిమాలకు ఒకే ధర సాధ్యం కాదని, వందల కోట్లతో నిర్మితమవుతున్న భారీ సినిమాలకు ఈ తీర్పు ఊరటనిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



