చరణ్‌తో మూడో సంక్రాంతి.. ఈ సారి ఏమవుతుందో!
on Dec 14, 2021
.webp)
భారీ బడ్జెట్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నిర్మాతల్లో డీవీవీ దానయ్య ఒకరు. 28 ఏళ్ళకు పైగా నిర్మాణ రంగంలో ఉన్న డీవీవీ దానయ్య ఇప్పటివరకు 18 సినిమాలు నిర్మించాడు. ఆయన నిర్మించిన 19వ చిత్రం `ఆర్ ఆర్ ఆర్`.. తన కెరీర్ లో ఫస్ట్ పాన్ - ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రానుంది.
లాఠీఛార్జ్ లో గాయపడిన ఫ్యాన్స్
ఇదిలా ఉంటే.. దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్స్ లో దానయ్యకిది మొదటి సినిమా కాగా.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో మాత్రం తనకిది నాలుగో చిత్రం. గతంలో `నాయక్` (2013), `బ్రూస్ లీ` (2015), `వినయ విధేయ రామ`(2019) వంటి సినిమాలు చరణ్ - దానయ్య కాంబోలో వచ్చాయి. వీటిలో `నాయక్` మాత్రమే విజయం సాధించింది. అంతేకాదు.. వీటిలో `నాయక్`, `వినయ విధేయ రామ` సంక్రాంతి సీజన్ లో వచ్చాయి. ఇప్పుడు వస్తున్న `ఆర్ ఆర్ ఆర్`.. పొంగల్ సీజన్ లో దానయ్యకి చరణ్ తో మూడో సినిమా కానుంది. మరి.. `నాయక్`తో హిట్, `వినయ విధేయ రామ`తో డిజాస్టర్ ఫలితాలను అందించిన సంక్రాంతి సీజన్.. `ఆర్ ఆర్ ఆర్`తో ఈ కాంబోకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



