
ఎట్టకేలకు సినిమా అభిమానులు, ప్రేక్షకులు 'ఈఎన్‌ఈ రిపీట్ ఉరఫ్ 'ఈ నగరానికి ఏమైంది' పార్ట్ 2 (నిన్న ప్రీమియర్స్) బాగుందనే మాటని సూర్యోదయం ముందుగానే వింటూ తమ దిన చర్యని స్టార్ట్ చేసారు. దీంతో ప్రెజెంట్ 50 దాటిన వాళ్ళు కూడా ఈఎన్‌ఈ రిపీట్ కోసం థియేటర్స్ కి తరలి వెళ్తున్నారు. మరి యూత్ క్రౌడ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ మూవీ హైలైట్స్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. మొదటి సినిమా ముగిసిన చోటు నుంచే ఈ కథ మొదలవుతుంది. వివేక్, కార్తీక్, కౌశిక్, ఉపేంద్ర కలిసి కన్యారాశి టీమ్ పేరుతో తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవుతుంది. ఆ నష్టాలతో నిర్మాత తీవ్ర ఇబ్బందుల్లో పడటం, స్నేహితుల మధ్య దూరం పెరగడం వంటి ఆసక్తికర మలుపులతో కథ ముందుకు సాగుతుంది. తమను తాము నిరూపించుకోవడానికి మరియు ఎదురైన సవాళ్లను అధిగమించడానికి ఈ గ్యాంగ్ మరోసారి సినిమా తీసేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో కథ థాయ్‌లాండ్‌కు మారడం, అక్కడి అడవిలో జరిగే షూటింగ్ ఎపిసోడ్లు, బీచ్ మరియు బార్ సన్నివేశాలు ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇస్తాయి.
అతిపెద్ద హైలైట్‌గా కౌశిక్ గా చేసిన అభినవ్ గోమటం నిలిచారు. తన సహజమైన కామెడీ టైమింగ్, హావభావాలు, రియాక్షన్లతో థియేటర్లలో నవ్వులు పూయించారని పలువురు ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ ఆర్థిక ఒత్తిళ్లు, సీరియస్ యాటిట్యూడ్‌తో కనిపిస్తూ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. మొదటి భాగంలో కార్తీక్ పాత్ర పోషించిన సాయి సుశాంత్ రెడ్డి స్థానంలో ఈసారి శ్రీనాథ్ మాగంటి కనిపించడం గమనార్హం.
.webp)
వెంకటేష్ కాకుమాను ఉప్పు పాత్రలో అలరించగా, శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్, ప్రియదర్శిని రామ్ కీలక పాత్రల్లో మెరిశారు. సాంకేతిక విభాగంలో వివేక్ సాగర్ నేపథ్య సంగీతం, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
ఇది కూడా చదవండి:అలీ వ్యాఖ్యలు వైరల్: ఆమె నర్సు అంట.. ఎవర్ని ఉద్దేశించి అన్నాడో ఆ హీరో ఫ్యాన్స్ కి బాగా అర్థమైంది!
సుమారు 2 గంటల 35 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో సెకండాఫ్‌లోని చివరి సుమారు 40 నిమిషాలు, గెస్ట్ అప్పియరెన్స్‌లుగా కనిపించే దర్శకుల సన్నివేశాలు థియేటర్లలో సందడి చేస్తాయి. S Originals మరియు Rootnode Cinema బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు.

2018 నాటి ఒరిజినల్ మ్యాజిక్‌తో పోల్చకుండా, స్నేహితులతో కలిసి సరదాగా నవ్వుకోవాలనుకునే వారికి ఈ సీక్వెల్ ఒక ఫ్రెండ్లీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది.
మీకు నచ్చవచ్చు: సల్మాన్ ఖాన్ మాతృభూమికి సెన్సార్ ఇచ్చిన గిఫ్ట్!
మీకు నచ్చవచ్చు :పవన్ కళ్యాణ్ పై కోట రుక్మిణి కీలక వ్యాఖ్యలు
[ENE Repeat , Viswak sen, Tharun Bhascker, Abhinav Gomatam Tollywood]





