Home

»

Latest News

పవన్ కళ్యాణ్ పై కోట రుక్మిణి కీలక వ్యాఖ్యలు: ఆయన్ని ఎందుకు లాగుతున్నారు!

Nov 19, 2026 10:21AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన క్రేజీ న్యూస్ ఏదైనా వస్తే సోషల్ మీడియాకి రెస్ట్ ఉండదనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కోవలోనే పవన్ కళ్యాణ్ గురించి  జనసేన సభ్యురాలు కోట రుక్మిణి రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియాని అత్యంత మోస్ట్ బిజీగా మార్చేసింది.


 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన ఉద్యోగ నియామకాల మోసం ఆరోపణలపై జనసేన నేత రుక్మిణి కోటా (కోట రుక్మిణి) తీవ్రంగా స్పందించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆమె గట్టిగా ఖండించారు. సుమారు  7 కోట్ల విలువైన జాబ్ స్కామ్ వ్యవహారంలో దాదాపు 36 మంది బాధితుల పేరుతో సోషల్ మీడియా, కొన్ని మీడియా వేదికల్లో తన పేరును, తన కుటుంబాన్ని లాగడంపై రుక్మిణి కోటా ఆవేదన వ్యక్తం చేశారు.   ఇన్నాళ్లూ తాను నమ్మిన విలువలు, వృత్తిపరమైన నియమ నిబంధనలను గౌరవిస్తూ మౌనంగా ఉన్నానని రుక్మిణి కోటా స్పష్టం చేశారు. అయితే ఆ మౌనాన్ని బలహీనతగా లేదా నిస్సహాయతగా భావించవద్దని హెచ్చరించారు. 

తన వ్యక్తిత్వాన్ని కించపరచడం, కుటుంబాన్ని వివాదాల్లోకి లాగడం వంటి చర్యలు హద్దులు దాటిపోయాయని, వాస్తవాలను వక్రీకరించి తనను నిందితురాలిగా చిత్రీకరించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. తన సంస్థలో పనిచేస్తున్న ఒక మాజీ ఉద్యోగి తన పేరు, కంపెనీ గుర్తింపు, అధికారిక పత్రాలను దుర్వినియోగం చేస్తూ ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగ నియామక మోసానికి పాల్పడిన విషయం తన దృష్టికి వచ్చిందని రుక్మిణి కోటా వివరించారు. ఆ అక్రమ కార్యకలాపాలన్నీ అధికారిక పని వేళలకు వెలుపల, తన ప్రమేయం, అనుమతి లేదా సమ్మతి లేకుండానే జరిగాయని తేల్చిచెప్పారు.

 

అసలు నిజం ఏమిటంటే, ఈ జాబ్ ఫ్రాడ్ గురించి తెలిసిన వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేసిందే తానేనని ఆమె వెల్లడించారు.   విషయం తెలిసిన తక్షణమే సదరు ఉద్యోగికి షో కాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరినట్లు రుక్మిణి కోటా తెలిపారు. అనంతరం అంతర్గత విచారణ జరిపి ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించానని, చట్టపరమైన చర్యల కోసం పోలీసు అధికారులను ఆశ్రయించానని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి:ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు: కానీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది భయ్యో!  

ఫిర్యాదు చేసిన తననే కొందరు రాజకీయ నేతలు, మీడియా వేదికలు నిందితురాలిగా చూపడం దారుణమని ఆమె తప్పుబట్టారు.   అంతేకాకుండా, ఈ వివాదంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరును లాగితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని రుక్మిణి కోటా తేల్చిచెప్పారు.

 

ధర్మ మార్గంలో నడిచేటప్పుడు సవాళ్లు, ఒడిదొడుకులు ఎదురవుతాయని, క్లిష్ట పరిస్థితుల్లోనూ బలంగా ఎలా నిలబడాలో పవన్ కళ్యాణ్ పట్టుదల, సహనం తనకు నేర్పించాయని పేర్కొన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, జనసేన వీర మహిళల స్ఫూర్తితో తన ఆత్మగౌరవాన్ని, కుటుంబాన్ని కాపాడుకునేందుకు అన్ని చట్టపరమైన మార్గాల్లో పోరాడతానని, తప్పుడు ప్రచారం చేసేవారిని చట్టం ముందు జవాబుదారీగా నిలబెడతానని రుక్మిణి కోటా స్పష్టం చేశారు.

 

మీకు నచ్చవచ్చు:ధురంధర్ దర్శకుడి కొత్త కథ!
మీకు నచ్చవచ్చు:అభిమానులకి ధనుష్ పిలుపు: విజయ్ కీలక నిర్ణయం!

 

[Pawan Kalyan. Kota Rukmini, Tollywood, Og 2]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com