జనవరి 12.. బన్నీకి మళ్ళీ మళ్ళీ విజయాలనిచ్చిన రోజు!
on Jan 12, 2022

`గంగోత్రి` (2003) నుంచి `పుష్ప - ద రైజ్` (2021) వరకు కథానాయకుడిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రయాణంలో ఎన్నో మరపురాని విజయాలు ఉన్నాయి. అలాగే రికార్డ్ బ్రేకింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే, మళ్ళీ మళ్ళీ విజయాలను అందించిన రోజు మాత్రం ఒకటే ఉంది. అదే.. జనవరి 12. తన కెరీర్ లో మరే తేదికి కూడా బన్నీ రెండేసి సినిమాలతో పలకరించిన సందర్భం లేకపోవడం గమనార్హం.
కాగా, సంక్రాంతి సీజన్ లో ఇప్పటివరకు బన్నీ ముచ్చటగా మూడు సార్లు వినోదాలు పంచారు. వాటిలో రెండు సినిమాల్లో కథానాయకుడిగా నటించగా.. ఒక చిత్రంలో అతిథి తరహా వేషంలో దర్శనమిచ్చారు. ఆ సినిమాలే.. `దేశ ముదురు` (2007), `ఎవడు` (2014), `అల వైకుంఠపురములో` (2020). విశేషమేమిటంటే.. ఈ మూడు చిత్రాలు కూడా జనవరి 12నే టార్గెట్ చేసుకుని వెండితెరపై సందడి చేశాయి. అలాగే, సంక్రాంతి విన్నర్స్ గా ఆయా సంవత్సరాల్లో నిలిచాయి.
Also Read: జనవరి 11 కేరాఫ్ ఘట్టమనేని వారి ఘనవిజయాలు!
`దేశ ముదురు` విషయానికి వస్తే.. అప్పట్లో బన్నీకదే హయ్యస్ట్ గ్రాసర్. అంతేకాదు.. టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ కి కూడా ఈ సినిమానే ఊపు తీసుకువచ్చింది. 2007 పొంగల్ విన్నర్ గా నిలిచింది `దేశ ముదురు`. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన `ఎవడు`లో అల్లు అర్జున్ ది చిన్న పాత్రే అయినా, ఎంతో ముఖ్యమైన వేషం. ఈ సినిమా కూడా 2014 సంక్రాంతి విజేతగా నిలిచింది. అలాగే `అల వైకుంఠపురములో` సంగతికి వస్తే.. రికార్డ్ వసూళ్ళను ఆర్జించి, `నాన్ - బాహుబలి ఇండస్ట్రీ హిట్`గా నిలిచి.. అప్పట్లో బన్నీ కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ అయింది. 2020 పొంగల్ విన్నర్ అనిపించుకుంది. మొత్తమ్మీద.. జనవరి 12 బన్నీ కెరీర్ లో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించిందనే చెప్పొచ్చు. మరి.. భవిష్యత్ లోనూ ఇదే తేదికి అల్లు అర్జున్ మళ్ళీ మళ్ళీ సందడి చేస్తారో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



