నేనని గుర్తుపట్టాలి కాబట్టే అఘోరగా అలా కనిపించాను!
on Jan 12, 2022

అఘోరాలు జటాఝూటాలతో (పొడవుగా రింగురింగులుగా పెంచిన జుట్టు)తో కనిపిస్తుంటారు. కానీ 'అఖండ'లో అఘోర పాత్రలో బాలకృష్ణ అందుకు భిన్నమైన గెటప్‌లో మామూలు జుట్టుతో కనిపించారు. అయ్యప్ప శర్మ, మరికొంతమంది అఘోరాలు జటాఝూటాలతోనే కనిపిస్తారు. ఎందుకని బాలకృష్ణ డిఫరెంట్ గెటప్‌లో కనిపించారు? ఈ ప్రశ్నకు బాలయ్య 'అఖండ' సంక్రాంతి సంబరాలలో భాగంగా జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో జవాబిచ్చారు. "అసలు ముందు నేనని గుర్తుపట్టాలి కదండీ" అని అన్నారు. "నటుల్లో రెండు రకాల వాళ్లుంటారు.. యాక్టర్స్ అండ్ స్టార్స్. స్టార్స్‌తో మనమెప్పుడూ ప్రయోగాలు చెయ్యకూడదు." అని బాలయ్య చెప్పారు.
Also read: అల్లు అరవిందే కాదు, 'అన్‌స్టాపబుల్' ప్రపోజల్‌తో ఎవరొచ్చినా నేను చేసుండేవాడ్ని!
"పెదపెద్ద హీరోలు వేరే భాషలవాళ్లు వాయిస్‌లు మార్చి, వాళ్ల సినిమాలు ఫ్లాపులయ్యి, ప్రింట్లు తిరిగి తెప్పించుకొని, మళ్లీ డబ్బింగ్ చెప్పి మళ్లీ విడుదల చేసి, హిట్టయ్యి నేషనల్ అవార్డ్ కూడా వచ్చిన సందర్భాలున్నాయి. అందుకని స్టార్స్‌తో మనమెప్పుడూ ప్రయోగాలు చెయ్యకూడదు. నేను చేసిన అఘోరా క్యారెక్టర్‌కు ఏ లోటూ రానివ్వకుండా డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎంతో జాగ్రత్తపడ్డారు. నామాలు కాకుండా చేతుల మీద పచ్చబొట్లు అయితేనేమి, చక్రాలైతేనేమి, చేతిలో త్రిశూలంతో చూపించారు." అని వివరించారు బాలయ్య.
Also read: 37 ఏళ్ల తర్వాత కూడా బాలయ్య ఎనర్జీ వెనకున్న రహస్యమిదే!
ఫ్యాన్స్ తనకు వాట్సాప్‌లో అఘోరాల గెటప్‌లు పంపించినట్లు ఆయన వెల్లడించారు. "అఘోరాలు తమ జుట్టును ఎలా కడుక్కుంటారనే వీడియోలు కూడా పంపించారు. హిమాలయాల్లో ఉండే అఘోరాలు గడ్డకట్టిన మంచును పగలకొట్టి మరీ కింద ఉన్న చల్లటి నీళ్లతో ఎలా స్నానం చేస్తారు వంటివి కూడా పంపించారు. సినిమాని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఊహించుకోవచ్చు. స్టార్స్ అనేసరికి ఒకరకంగా ఊహించుకుంటారు. సర్వసంగ పరిత్యాగం అంటాం. అలా కాకుండా అందం, రౌద్రంతో అఘోరా క్యారెక్టర్‌ను చూపించారు. ఆ రౌద్రమే కదా ఇవాళ డామినేట్ చేసింది. శివతత్త్వం అంటే ప్రధానంగా ఉండేది అదే. ఆ తత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ చూపించాం. భయంకరమైన అఘోరాగా అయ్యప్ప శర్మను చూపించారు. ఏదేమైనా నేను చేసిన అఘోరా పాత్రను ఏ లోటు లేకుండా రూపొందించడం జరిగింది." అని బాలకృష్ణ చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



