'ఖిలాడి'ని ఢీకొట్టే పవర్‌ఫుల్ ఆఫీసర్.. అర్జున్ భరద్వాజ్ లుక్ వచ్చేసింది!
on Jan 29, 2022

మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం 'ఖిలాడి'. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్ర చేశారు. లేటెస్ట్‌గా ఆయన లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో చేతిలో రివాల్వర్, కళ్లకు గాగుల్స్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు అర్జున్. ఆయన క్యారెక్టర్ పేరు 'అర్జున్ భరద్వాజ్' అని తెలియజేశారు. 'ఎ పవర్‌ఫుల్ ఆఫీసర్ విత్ కూల్ యాటిట్యూడ్' అంటూ ఆయన క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. సినిమాలో రవితేజ, అర్జున్ మధ్య వచ్చే సీన్లు ఆడియెన్స్‌ను అమితంగా అలరిస్తాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
Also read: అమ్మా.. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరుజన్మలకి కూడా కావాలి!
మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన 'ఖిలాడి' ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజవుతోంది. ఇప్పటికే ఈ మూవీ థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ రవితేజ కెరీర్‌లో అత్యధిక రేట్లకు అమ్ముడయ్యాయి. దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్ సహ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది.
Also read: మన గుండెల్లో ఎప్పటికీ నిలిచివుండే ఎవర్‌గ్రీన్ హీరో.. ఏఎన్నార్!
'పుష్ప' మూవీకి సమకూర్చిన డైలాగ్స్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన శ్రీకాంత్ విస్సాతో పాటు దేవి శ్రీప్రసాద్ సోదరుడు సాగర్ ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చారు. శ్రీమణి పాటలు రాయగా, సుజిత్ వాసుదేవ్, జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



