ఓటీటీలోనూ శ్రుతి హాసన్ సేమ్ స్ట్రాటజీ! మూడు భాషల్లో...
on Jan 30, 2022

తండ్రి కమల్ హాసన్ శైలిలోనే విభిన్న భాషల్లో నటిగా తన ప్రతిభను చాటుకుంది చెన్నై పొన్ను శ్రుతి హాసన్. తెలుగు, తమిళ, హింధీ.. ఇలా మూడు భాషల్లో కథానాయికగా విజయాలు చూసింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా ఓటీటీలోనూ తనదైన బాణీ పలికిస్తోంది ఈ అమ్మడు. 2020లో ఓ ఆంథాలజీలో మెరిసిన శ్రుతి.. 2021లోనూ అదే బాట పట్టింది.
కట్ చేస్తే.. ఈ ఏడాది ఏకంగా ఓ వెబ్ - సిరీస్ తో ఎంటర్టైన్ చేయబోతోంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఓటీటీలో శ్రుతి చేసిన ఈ మూడు ప్రయత్నాలు కూడా మూడు విభిన్న భాషల్లోనే కావడం విశేషం. 2020లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `పుత్తమ్ పుదు కాలై` అనే తమిళ ఆంథాలజీలో `కాఫీ, ఎనీవన్?` అనే సెగ్మెంట్ తో పలకరించింది శ్రుతి. ఇక 2021లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన `పిట్టకథలు` అనే తెలుగు ఆంథాలజీలో `ఎక్స్ లైఫ్` అనే సెగ్మెంట్ లో సందడి చేసింది.
అదేవిధంగా ఈ క్యాలెండర్ ఇయర్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతున్న `బెస్ట్ సెల్లర్` అనే హిందీ వెబ్ - సిరీస్ లో ఎంటర్టైన్ చేయబోతోంది. ఫిబ్రవరి 18న ఈ సిరీస్ స్ట్రీమ్ కాబోతోంది. మరి.. గత రెండు సందర్భాల్లోనూ ఆశించిన స్థాయి గుర్తింపుని పొందలేకపోయిన శ్రుతి.. ఈ సారైనా ఆకట్టుకుంటుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



