'దువ్వాడ జగన్నాథం' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ!
on Jan 29, 2022

'పుష్ప ది రైజ్' సినిమాతో నార్త్ లోనూ సత్తా చాటాడు అల్లు అర్జున్. హిందీలో ఊహించని కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టించాడు. బన్నీ యాక్టింగ్ కి, మ్యానరిజమ్స్ కి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ఎక్కడ చూసినా ప్రస్తుతం పుష్ప ఫీవర్ కనిపిస్తోంది. ఈ క్రమంలో బన్నీ హిట్ మూవీ 'దువ్వాడ జగన్నాథం(డీజే)' రీమేక్ తో డైరెక్టర్ హరీష్ శంకర్ బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారని న్యూస్ వినిపిస్తోంది.
బన్నీ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'దువ్వాడ జగన్నాథం'. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2017 లో విడుదలై మంచి వసూళ్లను రాబట్టి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి హిందీలో రీమేక్ చేయాలని హరీష్ శంకర్, దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారని, ఈ రీమేక్ లో సిద్దార్థ్ మల్హోత్రా నటించే అవకాశముందని తెలుస్తోంది. గతంలో హిందీ మూవీ 'దబాంగ్'ని మార్పులు చేసి తెలుగులో 'గబ్బర్ సింగ్'గా రీమేక్ చేసి సంచలన విజయాన్ని అందుకున్న హరీష్ శంకర్.. ఇప్పుడు 'దువ్వాడ జగన్నాథం' రీమేక్ తో బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తాడేమో చూడాలి.
ఇదిలా ఉంటే బన్నీ సూపర్ హిట్ మూవీ 'అల వైకుంఠపురములో' సైతం హిందీలో రీమేక్ అవుతోంది. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సమ్మర్ లో విడుదలయ్యే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



