టాక్ ఆఫ్ ద టౌన్: 'పుష్ప'పై మహేశ్ ట్వీట్.. బన్నీ రిప్లై!
on Jan 5, 2022

అనూహ్యమైన విషయం జరిగింది. ఇటు మహేశ్ ఫ్యాన్స్, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమాత్రం ఊహించని విషయం జరిగింది. బన్నీ టైటిల్ రోల్ చేసిన 'పుష్ప' మూవీపై మహేశ్ స్పందించాడు. ఇప్పటివరకూ ఆ ఇద్దరూ పరస్పరం కలుసుకున్నట్లు కానీ, మాట్లాడుకున్నట్లు కానీ మనం ఎప్పుడూ చూడలేదు. కనీసం సోషల్ మీడియా వేదికపై కూడా ఒకరి గురించి ఒకరు ఎలాంటి కామెంట్లు చేసుకోలేదు. దాంతో ఇప్పుడు 'పుష్ప' సినిమాపై, బన్నీ పర్ఫార్మెన్స్‌పై మహేశ్ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారింది.
Also read: ప్రభాస్ 'రాధేశ్యామ్'పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి లేదా?
మంగళవారం రాత్రి మహేశ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో, "పుష్పగా అల్లు అర్జున్ స్టన్నింగ్, ఒరిజినల్, సెన్సేషనల్.. స్టెల్లార్ యాక్ట్.. సుకుమార్ మరోసారి తన సినిమా రా, రస్టిక్, బ్రూటల్లీ హానెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. తన క్లాసే వేరు.." అని ట్వీట్ చేశాడు. మరో ట్వీట్‌లో "దేవి శ్రీప్రసాద్ ఏం చెప్పను.. నువ్వు రాక్‌స్టార్‌వి!! మొత్తం మైత్రి మూవీ మేకర్స్ టీమ్‌కు కంగ్రాట్స్. మిమ్మల్ని చూస్తుంటే ప్రౌడ్‌గా ఉంది గైస్" అని రాసుకొచ్చాడు.
Also read: ఏపీలో పేదల కోసం రేషన్ థియేటర్స్!
డిసెంబర్ 17న 'పుష్ప' రిలీజవగా, మహేశ్ నిన్న చూశాడన్న మాట. వెంటనే తన ఫీలింగ్స్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. తన పర్ఫార్మెన్స్‌పై, 'పుష్ప' మూవీపై, మొత్తం టీమ్‌పై మహేశ్ కురిపించిన ప్రశంసలకు బన్నీ ఈరోజు ఉదయం స్పందించాడు.
Also read: శివ పార్వతిలో 'టక్కరి దొంగ' మూవీ ఫస్ట్ డే చూశా.. ఇలా జరగడం బాధాకరం!
"థాంక్యూ వెరీ మచ్ మహేశ్‌బాబు గారూ.. పర్ఫార్మెన్స్‌ను, అందరి పనితనాన్నీ, 'పుష్ప' ప్రపంచాన్ని ఇష్టపడినందుకు చాలా ఆనందంగా ఉంది. హృదయాన్ని స్పృశించే కాంప్లిమెంట్. హంబుల్డ్" అని రిప్లై ఇచ్చిన బన్నీ దానికి బ్లాక్ హార్ట్ ఎమోజీని జోడించాడు.

నిజానికి చాలా కాలంగా మహేశ్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూ వస్తోంది. ఒకరి సినిమాల గురించి మరొకరు నెగటివ్‌గా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. 2020 సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' సినిమాలు విడుదలైనప్పుడు సోషల్ మీడియా వేదికగా వారి మధ్య యుద్ధం పరాకాష్టకు చేరుకుంది. ఇప్పుడు 'పుష్ప'పై తన వ్యూను పంచుకోవడం ద్వారా మహేశ్ అందరి మనసుల్నీ గెలిచాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



