అఫిషియల్.. బాలయ్య సినిమాలో జయమ్మ!
on Jan 5, 2022

విభిన్న పాత్రలతో తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. తన నటనతో తెలుగు ప్రేక్షకులకూ చేరువైంది. ముఖ్యంగా 'క్రాక్' సినిమాలోని జయమ్మ పాత్రకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు ఆమెని జయమ్మ అని పిలుస్తున్నారు. వరలక్ష్మిని జయమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇప్పుడు మరో పవర్ ఫుల్ రోల్ లో చూపించబోతున్నాడు.
2021 జనవరిలో రవితేజకు 'క్రాక్'తో సాలిడ్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని.. నటసింహం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీలో పవర్ ఫుల్ రోల్స్ లో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నట్లు గతంలోనే వార్తలు రాగా.. ఇటీవల దునియా విజయ్ నటిస్తున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ మూవీలో నటిస్తున్నట్లు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు. జయమ్మ పాత్ర లాగే ఇది కూడా గుర్తుండిపోయే పాత్ర అవుతుందని డైరెక్టర్ మలినేని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. 'క్రాక్'లో జయమ్మగా పవర్ ఫుల్ రోల్ లో చూపించిన మలినేని.. బాలయ్య సినిమాలో ఇంకెంత పవర్ ఫుల్ గా చూపిస్తాడోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

కాగా, ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



