తెలుగునాట 'అఖండ' లాభం 30 శాతం.. తెలంగాణలో మాత్రం 87 శాతం!
on Dec 27, 2021

నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించిన 'అఖండ' చిత్రం బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ మూవీ విడుదలై ఇప్పటికి 25 రోజులయ్యింది. ఈ కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్ల ముఖాలపై ఆనందాన్ని తీసుకువచ్చింది 'అఖండ'. టైటిల్ రోల్‌లో బాలకృష్ణ చేసిన నట విన్యాసాలకు ప్రేక్షకులు నీరజనాలు పడుతున్నారని కలెక్షన్లు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఏరియాలో బయ్యర్ల పంట పండింది. ఇక్కడ దిల్ రాజు రూ. 10.50 కోట్లకు పంపిణీ హక్కులు కొనుగోలు చేస్తే, 25 రోజుల్లో ఏకంగా రూ. 19.66 కోట్ల షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంటే 87 శాతం లాభాలు అందుకున్నారు బయ్యర్లు.
టికెట్ ధరలను తగ్గించకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మరింత మంచి లాభాలను బయ్యర్లు అందుకొనేవాళ్లే. అతి తక్కువ టిక్కెట్ ధరలున్న ప్రస్తుత సంక్షభ స్థితిలోనూ రాయలసీమ ఏరియాలోనూ 'అఖండ'కు మంచి లాభాలే వచ్చాయి. అక్కడ డిస్ట్రిబ్యూటర్ రూ. 10.60 కోట్లను వెచ్చిస్తే, 25 రోజులకు అక్కడ వసూలయ్యింది రూ. 14.92 కోట్ల షేర్. అంటే సుమారు 41 శాతం లాభాలు వచ్చాయి.
Also read: తగ్గేదేలే.. పుష్ప పేరిట మరో రికార్డు!
ఇక ఆంధ్రా ఏరియాలోనే బయ్యర్లు లాభాలు ఆర్జించలేకపోయారు. అయితే అక్కడ పెట్టుబడిని మాత్రం రికవర్ చేసింది అఖండ. అక్కడ బయ్యర్లు రూ. 24.4 కోట్లను వెచ్చిస్తే రూ. 24.81 కోట్ల షేర్ వచ్చింది. బరాబర్ సరిపోయింది. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు ఏరియాలకు బయ్యర్లు పెట్టిన డబ్బులు వచ్చేశాయి కానీ గుంటూరు, కృష్ణా ఏరియాలు ఇంకా రికవర్ కాలేదు. గుంటూరులో ఇంకా రూ. 75 లక్షలు, కృష్ణాలో సుమారు రూ. 20 లక్షలు డెఫిసిట్ ఉంది. దీన్ని బట్టి గుంటూరు ఏరియా బయ్యర్ మాత్రమే ఒకింత ఎక్కువగా నష్టపోనున్నట్లు తెలుస్తోంది.
Also read: 2021 జ్ఞాపకాలు: కిక్కెక్కించిన `ఐటమ్` సాంగ్స్!
ఓవరాల్‌గా చూస్తే.. తెలుగునాట 'అఖండ' సినిమాపై బయ్యర్లు పెట్టిన పెట్టుబడి రూ. 45.50 కోట్లు కాగా, 25 రోజులకు రికవర్ అయ్యింది రూ. 59.39 కోట్లు!. అంటే 30 శాతానికి మించి లాభాలు వచ్చాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



