Home

»

Latest News

తగ్గేదేలే.. పుష్ప పేరిట మరో రికార్డు!

Dec 26, 2021

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'పుష్ప ది రైజ్'. డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన పుష్ప.. టికెట్ల అమ్మకం విషయంలోనూ రికార్డు సృష్టించింది.

పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో.. బుక్‌ మై షోలో అమ్ముడైన టికెట్లు తెలియజేస్తున్నాయి. పుష్ప విడుదలైన 8 రోజుల్లోనే బుక్‌ మై షోలో 3.5 మిలియన్(35 లక్షలు) టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాదిలో ఏ సినిమాకూ ఈ రేంజ్‌ లో టికెట్లు అమ్ముడవలేదు. దీంతో పుష్ప పేరిట మరో రికార్డు నమోదైంది. దీంతో మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు.

పుష్ప విడుదలకు ముందు రూ.145 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇప్పటిదాకా 123 కోట్ల షేర్ రాబట్టిన పుష్ప.. మరో 23 కోట్లు రాబడితే హిట్ లిస్ట్ లో చేరనుంది. అయితే దాదాపు అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లను రాబడుతున్న పుష్ప.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టికెట్ రేట్లు కారణంగా అక్కడ భారీ నష్టాలను మూటగట్టుకునే అవకాశముందని అంటున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com