`అమ్మ రాజీనామా`కి 30 ఏళ్ళు!
on Dec 27, 2021

`అమ్మ` గొప్పతనాన్ని చాటిచెబుతూ తెలుగునాట పలు చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో `అమ్మ రాజీనామా`కి ప్రత్యేక స్థానం ఉంది. `అమ్మ` పదవికి `రాజీనామా` చేసిన భారతి అనే ఓ మాతృమూర్తి కథే ఈ చిత్రం. దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో.. అమ్మగా `ఊర్వశి` శారద నటించగా సత్యనారాయణ, ప్రసాద్ బాబు, బ్రహ్మానందం, సాయికుమార్, కవిత, రజిత, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు అతిథి పాత్రలో దర్శనమిచ్చారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు ఈ సినిమాతోనే సినిమాటోగ్రాఫర్ గా తొలి అడుగేయడం విశేషం.
Also Read: చరణ్ కి జోడీగా `లోఫర్` భామ!
దిగ్గజ స్వరకర్త చక్రవర్తి సంగీతమందించిన ఈ చిత్రంలో ``ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం``, ``సృష్టికర్త ఒక బ్రహ్మ`` వంటి గీతాలు బహుళ ప్రజాదరణ పొందగా.. ``చీకట్లో ఆడపిల్ల``, ``చనుబాలు తాగితేనే``, ``ఇది ఎవ్వరు ఎవ్వరికీ ఇవ్వని వీడుకోలు`` పాటలు కూడా రంజింపజేశాయి. ప్రముఖ నిర్మాతలు సి. అశ్వనీదత్, కె. దేవీవరప్రసాద్, టి. త్రివిక్రమరావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. కన్నడంలో సీనియర్ నటి లక్ష్మి ప్రధాన పాత్రధారిణిగా `అమ్మ` పేరుతో రీమేక్ అయింది. 1991 డిసెంబర్ 27న విడుదలై జననీరాజనాలు అందుకున్న `అమ్మ రాజీనామా`.. నేటితో 30 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



