వెంకీ... వరుణ్... కాపీ స్టూడెంట్సే!
on Dec 24, 2018
స్కూల్లో, కాలేజీలో కొంతమంది గుడ్ స్టూడెంట్స్ ఉంటారు. కాపీ చేయరు. చదువుకునో... టీచర్లు చెప్పింది గుర్తుపెట్టుకునో... ఎగ్జామ్స్ రాస్తారు. మంచి మార్కులు తెచ్చుకుంటారు. కొంతమంది బ్యాడ్ స్టూడెంట్స్ ఉంటారు. కాపీ కొడతారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ కేటగిరీలోకి వస్తారు. స్కూల్, కాలేజీ రోజుల్లో ఈ హీరోలిద్దరూ కాపీ చేశామని రానా దగ్గుబాటి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'నంబర్ వన్ యారీ' కార్యక్రమంలో ఒప్పుకున్నారు. ఫ్యాంట్కి పెట్టుకొనే బెల్ట్‌కి ఒక జిప్ ఉంటే... అందులో స్లిప్స్ పెట్టేవాడినని వెంకటేష్ తెలిపారు. టెక్స్ట్ బుక్స్‌లో పేజీలు చింపి బాత్రూమ్లో పెట్టేవాడిననీ, వాటికి సంబంధించిన ప్రశ్నలు వస్తే ఎగ్జామ్ మధ్యలో బాత్రూమ్కి వెళ్లి ఆన్సర్ బట్టీపట్టి వచ్చి రాసేవాడినని వరుణ్ తేజ్ తెలిపాడు. ఈ హీరోలు ఇద్దరూ ఇద్దరూ... కాపీ స్టూడెంట్సే! తాను కాపీ చేశానని చెప్పిన వెంకటేష్... ఈ విషయంలో తనను ఆదర్శంగా తీసుకోవద్దని, తాను చేసింది తప్పేనని వెంకటేష్ అన్నారు. ఇవన్నీ టెలికాస్ట్ చేస్తే బావుండేదని అన్నారు. వెంకీ చెప్పిన సమాధానాలను ఎడిట్ చేయకుండా టెలికాస్ట్ చేశారు.