ENGLISH | TELUGU  

'సంచారి'గా వస్తున్న ప్రభాస్.. లుక్ అదిరింది!

on Dec 13, 2021

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'రాధేశ్యామ్'. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన 'ఈ రాతలే', 'నగుమోము తారలే' సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా మూడో సాంగ్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

Also Read: 'శ్యామ్' అండ్ 'శ్యామ్'.. సేమ్ టు సేమ్!

'రాధేశ్యామ్' నుంచి 'సంచారి' సాంగ్ టీజర్ ని రేపు(మంగళవారం) మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఐస్ పై స్కేటింగ్ చేస్తున్న ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో ప్రభాస్ అందమైన విభిన్న ప్రదేశాల్లో సంచరిస్తాడని తెలుస్తోంది. మరి అలా సంచరిస్తుండగానే హీరోయిన్ పూజ తారసపడుతుందేమో చూడాలి.

జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించిన 'సంచారి' సాంగ్ కి కృష్ణ కాంత్ లిరిక్స్ అందించాడు. 'ఈ రాతలే', 'నగుమోము తారలే' సాంగ్స్ కి కూడా ఆయనే లిరిక్స్ అందించడం విశేషం. 'సంచారి' సాంగ్ ని కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఆలపించాడు.

Also Read: విలాస‌వంత‌మైన ఫామ్‌హౌస్‌ను క‌ట్టించ‌బోతున్న ప్ర‌భాస్‌!

యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న 'రాధేశ్యామ్' సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.